పొగరు ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది (ఖైదీ నెం 150 ట్రైలర్)
‘పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటంది’ అంటూ సాగిన ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' చిత్రం ప్రీ రిలీజ్ పంక్షన్ శనివారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. 'పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటంది' అంటూ సాగిన ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
చిరంజీవి డాన్స్, ఫైట్స్ తో పాటు అదిరిపోయే డైలాగులు కూడా ఉన్నాయి. 'కష్టం వస్తదో.. కార్పొరేట్ సిస్టమ్ వస్తదో రమ్మను'.. 'వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా! కందిపప్పు నుంచి కరివేపాకు దాకా! మినప నుంచి మిరప దాకా! అన్ని ఆ పల్లెల నుంచే రావాలి' అంటూ సాగే డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.

వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరి 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
chiranjeevi ram charan tollywood khaidi no 150 vv vinayak చిరంజీవి రామ్ చరణ్ టాలీవుడ్ ఖైదీ నెం 150 వివి వినాయక్


Click it and Unblock the Notifications