Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అన్నయ్య అరిచినట్లు రియల్ లైఫ్‌లో జరుగదు: ‘ఖాకీ ’ ఆడియో వేడుకలో కార్తి
కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ నటించిన 'ఖాకీ' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగింది.
కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన తమిళ సినిమా 'ధీరన్ అదిగారమ్ ఒండ్రు'ను తెలుగులో 'ఖాకీ' పేరుతో విడుదల చేయబోతున్నారు. నవంబర్ 17న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో 'ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ అధినేత ఉమేశ్ గుప్తా విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో ఆడియో రిలీజ్ వేడుక జరిగింది.
Recommended Video
డిఫరెంట్ మూవీ
పోలీస్ ఆఫీసర్‌గా నేను చేస్తున్న రెండో సినిమా. ఇంతకు ముందు విక్రమార్కుడు చిత్రాన్ని తమిళంలో ‘సిరుతై' పేరుతో చేశాం. అక్కడ పెద్ద హిట్టయింది. ‘ఖాకీ' సినిమా సిరుతై చిత్రానికి పూర్తి డిఫరెంటుగా ఉంటుంది అన్నారు.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా
‘సిరుతై' సినిమా సమయంలో చాలా మంది పోలీస్ ఆఫీసర్లను కలిశా. అపుడు మాకు ఓ కేసు గురించి తెలిసింది. 1995 నుండి 2000 సంవత్సరం మధ్యలో ఓ డెకాయిట్స్ గ్యాంగ్ చేసిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా స్క్రిప్టును వినోద్ సిద్ధం చేశారు అని కార్తి తెలిపారు.
అన్నయ్య చేసింది రియల్ లైఫ్‌లో జరుగదు
వినోద్ ఈ సినిమాలో క్యారెక్టర్ రాసే విధానం కూడా చాలా బాగా నచ్చింది. ఇందులో కనిపించబోయేది ఇప్పటి వరకు మీరు సినిమాల్లో చూసిన పోలీస్ ఆఫీసర్ కాదు. మామూలుగా కొన్ని సినిమాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సీనియర్ ఆఫీసర్ పై అరవడం లాంటివి డిపార్టుమెంటులో జరుగదు. అలాంటి రైట్ వారికి ఉండదు. మా అన్నయ్య పై ఆఫీసర్ల మీద అరిచే క్యారెక్టర్లు చేశాడు. అలాంటివి రియల్ లైఫ్‌లో అసలు జరుగవు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ సిన్సియారిటీ, డెడికేషన్ చూపించాం... అని కార్తి వెల్లడించారు.
జిబ్రాన్ మంచి సంగీతం ఇచ్చారు
జిబ్రాన్ మంచి సంగీతం ఇచ్చారు. ప్రతి సిచ్యువేషన్‌కు బాగా సూటయ్యేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అన్ని సాంగ్స్ చాలా డిఫరెంటుగా ఉన్నాయి... అని కార్తి తెలిపారు.
రకుల్ ఇంప్రెస్ చేసింది
రకుల్ నన్ను తొలిసారి కలిసినపుడే ఇంప్రెస్ చేసింది. ఆమె తన పనిని చాలా ప్రొఫషనల్‌గా చేస్తుంది. ఆమె మిలట్రీ ఫ్యామిలీ నుండి వచ్చింది. డిసిప్లిన్ కూడా చాలా ఎక్కువ. గ్లామర్ పాత్రలు చేసిన ఈ అమ్మాయి విలేజ్ గర్ల్ రోల్ చేయగలుగుతుందా? లేదా? అనే డౌట్ ఉండేది. కానీ చాలా బాగా చేసింది... అని కార్తి ప్రశంసించారు.
ముఖ్యపాత్రలు, టెక్నీషియన్స్
అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూరన్, ఆర్ట్: కె. ఖదీర్, ఎడిటర్: శివనందీశ్వరన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, డ్యాన్స్: బృంద, నిర్మాతలు: ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా.