నా సినిమా పైరసీలో చూడు, కానీ ఒక పని చెయ్యి..: హ్యాట్సాఫ్ ఆర్.ఎస్. ప్రభు
విదేశీ అభిమాని.. తమ దగ్గర "ధీరన్ అధికారం ఒండ్రు" రిలీజవ్వలేదని.. మరి సినిమా ఎలా చూడాలని నిర్మాత ప్రభును సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ప్రభు స్పందన మాత్రం సూపర్ గా ఉంది
Recommended Video

ఒక సినిమా పైరసీ లో వచ్చిందీ అంటే ఆ నిర్మాత ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఎన్ని రకాల కట్టడి చేసినా ఈ పైరసీని మాత్రం ఆపలేకపోతున్నారు. వందలకోట్ల రూపాయల వ్యాపారం కేవలం సినిమాల పైరసీమీదే ఆధారపడి ఉన్నదన్నది కాదనలేని నిజం. ఒకపక్క సినిమా రిలీజ్ అయ్యీ అవకుండానే అటు రకరకాల వెబ్సైట్లలో ఈ సినిమాల ఒరింటులు కనిపిస్తున్నాయి. అయితే అందరు నిర్మాతలూ ఏమో గానీ తమిళ నిర్మాత ఎస్.ఆర్ ప్రభు మాత్రం ఒక అభిమానికి తానే నా సినిమాని పైరసీలో చూడు అంటూ సలహా ఇచ్చాడు...

ఎస్.ఆర్.ప్రభు
తమిళ నిర్మాత ఎస్.ఆర్.ప్రభు మాత్రం పైరసీ విషయమై చాలా తాపీగా స్పందించాడు. ఓ అభిమానికి పైరసీలో సినిమా చూడమంటూ సలహా ఇచ్చాడు. ఆయన చూడమన్నది తన నిర్మాణంలో తెరకెక్కిన ‘ధీరన్ అధికారం ఒండ్రు' సినిమాను. ఈ చిత్రం తెలుగులో ‘ఖాకి' పేరుతో రిలీజైంది.

పోలీస్ యాక్షన్ థ్రిల్లర్
కార్తి-రకుల్ ప్రీత్ జంటగా వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికైతే అటు తమిళ, ఇటు తెలుగు రెండు ప్రాంతాల్లోనూ మంచి టాక్‌నే సంపాదించుకొని నిలకడగా ఉంది.

సినిమా ఎలా చూడాలి
ఐతే ఓ విదేశీ అభిమాని.. తమ దగ్గర ‘ధీరన్ అధికారం ఒండ్రు' రిలీజవ్వలేదని.. మరి తాము సినిమా ఎలా చూడాలని నిర్మాత ప్రభును సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ప్రభు స్పందన మాత్రం సూపర్ గా ఉంది, నా సినిమా పైరసీ వెర్షన్ చూసినా తనకేం అభ్యంతరం లేదన్నట్టు చెప్పాడు.

అమేజాన్ ప్రైంలో
దీనికి ప్రభు స్పందిస్తూ.. 25 రోజుల తర్వాత ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైంలో పెడుతున్నామని.. అప్పటిదాకా ఎదురు చూడాలని.. లేని పక్షంలో ఇంటర్నెట్లో మంచి క్వాలిటీ ప్రింట్ వెతికి పట్టుకుని సినిమా చూడాలని షాకింగ్ సలహా ఇచ్చాడు.

ఎవరికైనా 10 డాలర్లు సాయం చేయి
ఐతే పైరసీ వెర్షన్ చూశాక కష్టంలో ఉన్న ఎవరికైనా 10 డాలర్లు సాయం చేయాలని చెప్పాడు ప్రభు. ఐతే ఆ అభిమాని మాత్రం ప్రభు సలహా పాటించడానికి అంగీకరించలేదు. తాను అమేజాన్ ప్రైంలోనే సినిమా చూస్తానని అతను జవాబివ్వడం విశేషం.


Click it and Unblock the Notifications











