చెడ్డవాళ్లని కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం... ( కార్తి ‘ఖాకీ’ ట్రైలర్)

కార్తి నటించిన ‘ఖాకీ’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నవంబర్లో రిలీజ్ చేయనున్నారు.

By Bojja Kumar

కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తమిళ సినిమా 'ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు'ను తెలుగులో 'ఖాకీ' పేరుతో విడుదల చేయబోతున్నారు. ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌'... అనేది ఉపశీర్షిక. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.

ఈ చిత్రంలో కార్తి నిజాయితీగల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్లోని డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. పవర్లో ఉన్నోడి ప్రాణానికి ఇచ్చే విలువ పబ్లిక్ ప్రాణానికి ఎందుకు ఇవ్వరు సార్... అంటూ కార్తి చెప్పే డైలాగ్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

చెడ్డవాళ్లని కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం

చెడ్డవాళ్లని కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం

మనం చెడ్డవాళ్ల నుండి మంచి వాళ్లను కాపాడే పోలీస్ ఉద్యోగం చేయడం లేదు, మంచి వాళ్ల నుండి చెడ్డ వాళ్లను కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం.... అంటూ కార్తి చెప్పే డైలాగ్స్ సగటు ప్రేక్షకుడిని ఆలోచింపచేసేలా ఉన్నాయి.

Recommended Video

Karthi's Dheeran Adhigaram Ondru Trailer Date Out కార్తీ, రకుల్‌ మ్యాజిక్..
1995 నుండి 2005 మధ్య జరిగిన సంఘటన

1995 నుండి 2005 మధ్య జరిగిన సంఘటన

1995 నుండి 2005 మధ్య జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకుని... 2005లో పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ సినిమా కథ సిద్ధం చేశారు. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్... రాజకీయ నాయకులకు, వారి అండతో నేరాలు చేసే వారి ఆటకట్టించే నేపథ్యంతో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది.

నవంబర్లో ప్రేక్షకుల ముందుకు

నవంబర్లో ప్రేక్షకుల ముందుకు

వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ సినిమాను నవంబర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తెలుగులో రిలీజ్ చేస్తున్న ఉమేశ్‌ గుప్తా

తెలుగులో రిలీజ్ చేస్తున్న ఉమేశ్‌ గుప్తా

ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌' సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా ఈ సినిమా ద్వారా తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. 'ఖాకీ' సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

నటీనటులు, తెర వెనక

కార్తి, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, ఆర్ట్‌: కె. ఖదీర్, ఎడిటర్‌: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X