రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డుతో సంచలనం సృష్టించిన 'మహేష్ ఖలేజా'
అక్టోబర్ 1 'రోబో", అక్టోబర్ 7న 'ఖలేజా" అక్టోబర్ 8న 'బృందావనం" చిత్రాల రాకతో పోటి పసందుగా సాగుతోంది. బాక్సాఫీస్ ల్లో కలెక్షన్ల కనక వర్షం కురుస్తుందనీ అంతా ఆశిస్తుంటే. మరో ప్రక్క బిజినెస్ పరంగా చర్చలు, కోటాను కోట్ల బిజినెస్ లతో, రికార్డులులతో ప్రభంజనం సృష్టిస్తున్నాయి.
ప్రిన్స్ మహేష్ బాబు మరియు టేర్రిఫిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న 'మహేష్ ఖలేజా' చిత్రం ఒకపక్క అనేక సమస్యలతో సతమతమవుతున్న..మరోపక్క రికార్డులను సృష్టిస్తోంది..చిత్రం విడుదలకు తేదికి ముందే బిజినెస్ పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇది తెలుగు చలన చిత్ర చరిత్రలో సరికొత్తది కావటం విశేషం. ఆ వివరాలను క్రింది విధంగా ఉన్నాయి.
ఆంధ్రా - 12 కోట్ల 95 లక్షలు
సీడెడ్ - 6 కోట్ల 20 లక్షలు
నైజాం - 12 కోట్ల 20 లక్షలు
కర్ణాటక - 1 కోటి 75 లక్షలు
ఓవర్సీస్ - 2 కోట్ల 25 లక్షలు
తమిళనాడు, ఒరిస్సా, నార్త్ ఇండియా - 0.65 లక్షలు
శాటిలైట్ - 6 కోట్ల 50 లక్షలు
ఆడియో - 70 లక్షలు
మొత్తం..43 కోట్ల 22 లక్షలతో సరికొత్త రికార్దును చేయటమే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసింది.


Click it and Unblock the Notifications











