మహేష్ బాబు థమ్సప్ కొంటే ‘ఖలేజా’ ఫ్రీ..!?
అవునండీ ఇది నిజం. మహేష్ బాబు థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్ అని అందరికీ తెలిసిన విషయమే. మీరు కనుక థమ్సప్ మల్టిపుల్ ప్యాక్ కొంటే ఆశ్చర్యపోతారు. ఎందుకో తులుసా....? ఆ ప్యాక్‌లో ప్రిన్స్ మహేష్, అందాల ముద్దుగుమ్మ అనుష్క జంటగా శింగనమల రమేష్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మించిన 'ఖలేజా" డివిడి అందులో వుంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ ఇది రెండసారి. అలాగే థమ్సప్ చిన్న బాటిల్స్ పై ఖలేజా లోగో అడ్వర్టైజ్ చేయబడివున్నదని సమాచారం. ఈ యాక్టివిటిని మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు 9న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
అదేమిటి మహేష్ 'ఖలేజా" ఇంకా రిలీజ్ కాలేదు కదా? డివిడి ఏమిటి అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే...'ఖలేజా" షూటింగ్ ను ఎక్కడెక్కడ తీసారు? ఎలా జరిగింది? ఓ ప్రోమో ఉంటాయట. ప్రస్తుతానికి ఇవి మార్కెట్లో లేవు. అతి త్వరలో రిలీజ్ కానున్న 'మహేష్ ఖలేజా"తో పాటు ఇవి కూడా రిలీజ్ కానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











