మహేష్ ట్విట్టర్‌లో ‘ఖలేజా’ పాటతో అభిమానులు కేరింతలు...
మహేష్ 'ఖలేజా", జూ ఎన్టీఆర్ 'బందావనం" చిత్రాల విడుదల తేదీల విషయంలో రసవత్తరంగా సాగుతోన్న పోరు మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో పైరసీ బెడదను వదిలించుకోవాడానికి స్టార్స్ సినిమాలను వీలైనన్ని ఎక్కువ థియేటర్ల లో రిలీజ్ చేయడం..తొలి వారంలోనే భారీ మొత్తాల్ని రాబట్టుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం సినిమాలు లేట్ అయ్యేకొద్ది వారిలో నిరుత్సాహం కొరవడుతోంది. అది గమనించిన మహేష్ బాబు. ఆయన ఫ్యాన్స్ కి కొద్దిగా ఊరట కలిగిస్తూ చిన్న ట్విస్ట్ కోసం ఒక సాంగ్ ను పోస్ట్ చేశారు.
మహేష్ బాబు, అనుష్క జంటగా కనకరత్న మూవీస్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో శింగనమల రమేష్ బాబు, సి. కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'మహేష్ ఖలేజా" పాటలు ఈ నెల 27న, చిత్రాన్ని అక్టోబర్ 7న విడుదలకు సిద్దం చేస్తున్నారు. అయితే దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి మహేష్ సినిమా కోసం తహతహలాడుతున్న అభిమానుల కోసం మహేష్ 'ఖలేజా" పాటలు రిలీజ్ కాకముందే తన ట్విట్టర్ ద్వారా 'ఖలేజా"లోని ఒక పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ విన్న ప్రిన్స్ అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.


Click it and Unblock the Notifications











