నా కెరీర్ లో 'ఖలేజా' ఓ కలికితురాయిలా నిలిచిపోతుంది: మహేష్ బాబు
తన సినిమాల గురించి మహేష్ బాబు ఎప్పుడూ మరీ ఎక్కువగా మాట్లాడరు. ఆమాటకొస్తే..మీడియాతో ముచ్చటించేందుకు మహేష్ పెద్దగా ఇష్టపడరు. అటువంటి మహేష్..తన తాజా చిత్రం 'ఖలేజా' గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకూ తను నటించిన చిత్రాలన్నీ ఒకెత్తయితే..'ఖలేజా' ఒక్కటీ ఒకెత్తుగా నిలుస్తుందని ఆయన చెబుతున్నారు. 'ఖలేజా'కు ముందు మహేష్ బాబు నటించిన చిత్రాల్లో తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసిన 'పోకిరి' కూడా ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు..'ఖలేజా' చిత్రం ఎలా ఉండబోతుందనే ఆసక్తి చెలరేగడం ఖాయం.
'నా కెరీర్ లో 'ఖలేజా' ఓ కలికితురాయిలా నిలిచిపోతుంది. నా క్యారక్టరైజేషన్, నా కాస్ట్యూమ్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఇంత మంచి చిత్రాన్ని నాకిస్తున్న నా మిత్రుడు త్రివిక్రమ్ కు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అంటూ మహేష్ బాబు చెబుతుండడంతో అభిమానులు ఇప్పట్నుంచే పండగ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











