రొమాంటిక్ యక్షన్ థ్రిల్లర్‌‍గా ‘ఖతర్నాక్ గాళ్లు’

By Bojja Kumar

హైదరాబాద్: హిందీలో రూపొందిన 'రఫ్తా..రఫ్తా' అనే చిత్రాన్ని తెలుగులో 'ఖతర్నాక్‌గాళ్లు'గా అనువదిస్తున్నారు. యస్‌.కె.ఫిలింస్‌ పతాకంపై సయ్యద్‌ కరీం ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వెంకట్‌, రాహుల్ రాయ్, మోనికా, ఊర్మిళా రావ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సయ్యద్ కరీం చిత్ర విశేషాలను తెలియజేస్తూ...యువతను విశేషంగా ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో కొంత యాక్షన్ పార్ట్ కూడా వుంది. లండన్ నేపథ్యంలో కథ సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన వెంకట్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ముమైత్‌ఖాన్‌పై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు.

లవ్ రొమాంటిక్ యాక్షన్ తో కూడుకున్న మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విజయం సాధిస్తుంది. త్వరలో ఆడియోను, సెప్టెంబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలో వెంకట్, రాహల్ రాయ్, మోనికా, ఊర్మళా రావ్, ముమైత్ ఖాన్, శక్తి కపూర్, ధర్మ అధికారి, జాలిబ్ ఖాన్, సమీరా, శీతల్ బేడీ, శక్తి సింగ్, బ్రౌనీ, స్రన్ బాబ్ ఖాన్, ఆశా సహదేవ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా : దామోదర నాయుడు, సంగీతం: సేన్ బ్రదర్, నిర్మాత: సయ్యద్ కరీం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజశర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X