త్రిష..ప్లాఫ్ సినిమాకి ఆస్కార్ లైబ్రరీ లో స్ధానం
త్రిష బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ నటించిన కట్టా మీటా చిత్రం ప్లాఫ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ చిత్రం స్క్రీన్ ప్లే ఆస్కార్ లైబ్రరీలో స్ధానం సంపాదించుకుంది. ఈ మేరకు చిత్ర దర్సకుడు ప్రియదర్శన్ కి ది లైబ్రరీ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ..లాస్ ఏంజిల్స్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. వారు ఈ చిత్రం స్క్రీన్ ప్లే కాపీని తమ లైబ్రరీ కోసం పంపమన్నారు. తమ కలెక్షన్లో ఈ స్క్రీన్ ప్లే ని పెట్టుకుని సినిమా విద్యార్దులకు, ఫిల్మ్ మేకర్స్ కు, రైటర్స్ కు, నటీనటులుకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇక ఈ విషయమై ప్రియదర్శన్ మాట్లాడుతూ...నా కట్టా మీటా చిత్రం ఆస్కార్ లైబ్రరీలో స్టూడెంట్స్ రీసెర్చ్ కోసం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన కష్టానికి ఇది గుర్తింపుగా భావిస్తున్నాను అన్నారు. ఇక కట్టా మీటా చిత్రంలో త్రిష, అక్షయ్ కుమార్ కలిసి నటించారు. ఇక ఈ కట్టా మీటా చిత్రం మళయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో 1989 రూపొంది సూపర్ హిట్ అయింది. ఆ చిత్రం పేరు..వెల్లం కులదే నాడు. మోహన్ లాల్, శోభన, నెరముడి వేణు నటించిన ఈ చిత్రానికి రచన మళయాళ కామిడీ రచయిత శ్రీనివాసన్ చేసారు. ఇక ఈ చిత్రం కథ మున్సిపల్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. బిల్డింగ్స్, పబ్లిక్ రోడ్స్ చుట్టూ తిరిగే ఈ కథ అప్పట్లో ఓ పొలిటికల్ సెటైర్ గా సంచలనం సృష్టించింది.


Click it and Unblock the Notifications











