కలెక్టర్ గా త్రిష ఆ కామిడీలో అదరకొట్టనుందా?
తన గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న కట్టా-మీటా చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమవుతున్న త్రిష...ఓ అయ్యే ఎస్ ఆఫీసర్ పాత్రలో చేస్తోందని సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ఈ కామిడీ జూలై 23న రిలీజ్ అవుతోంది. ఇందులో అక్షయ్ పాత్ర సచిన్ టికులే అనే రోడ్ కాంట్రాక్టర్. లంచం ఇచ్చుకోలేక ఈ వ్యవస్ధలో బ్రతకలేక నలిగిపోతూంటాడు. ఇక ఈ చిత్రం మళయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో 1989 రూపొంది సూపర్ హిట్ అయింది. ఆ చిత్రం పేరు..వెల్లం కులదే నాడు. మోహన్ లాల్, శోభన, నెరముడి వేణు నటించిన ఈ చిత్రానికి రచన మళయాళ కామిడీ రచయిత శ్రీనివాసన్ చేసారు. ఇక ఈ చిత్రం కథ మున్సిపల్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. బిల్డింగ్స్, పబ్లిక్ రోడ్స్ చుట్టూ తిరిగే ఈ కథ అప్పట్లో ఓ పొలిటికల్ సెటైర్ గా సంచలనం సృష్టించింది.
More from Filmibeat
త్రిష నమో వెంకటేశ అక్షయ్ కుమార్ ప్రియదర్శన్ శ్రీను వైట్ల trisha namo venkatesa akshay kumar venkatesh katrina kaif


Click it and Unblock the Notifications











