»   »  తెలుగు హీరో, డైరెక్టర్ కిడ్నాప్...రూ. 10 కోట్ల డిమాండ్!

తెలుగు హీరో, డైరెక్టర్ కిడ్నాప్...రూ. 10 కోట్ల డిమాండ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఖయ్యూం భాయ్' సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు భరత్ పారేపల్లి, ఈ చిత్రంలో హీరోగా టైటిల్ రోల్ చేసిన కట్టా రాంబాబు కిడ్నాప్ కు గురి కావడం చర్చనీయాంశం అయింది.

భరత్, రాంబాబు చెప్పిన వివరాల ప్రకారం...కారులో వెలుతున్న తమను కొందరు దుండుగులు అడ్డుకుని కిడ్నాప్ చేశారని, అనంతపురం తీసుకెళ్లి ఓ హోటల్‌లో ఉంచి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, తర్వాత వారే తమను వదిలేసి పారిపోయారని తెలిపారు.


హైదరాబాద్ వచ్చాక పూర్తి డీటేల్స్

హైదరాబాద్ వచ్చాక పూర్తి డీటేల్స్

ప్రస్తుతం భరత్, రాంబాబు అనంతపురం నుండి హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ వచ్చాక ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.పోలీసులు విచారణ?

పోలీసులు విచారణ?

అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంపై భరత్, రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. త్వరలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.అనేక అనుమానాలు

అనేక అనుమానాలు

ఈ కిడ్నాప్ వ్యవహారం అంతా అనుమానాస్పదంగా ఉందని, నిజంగానే వీరిని దండుగులు కిడ్నాప్ చేశారా? సినిమా ప్రమోషన్ కోసం డ్రామా ఆడుతున్నారా? కిడ్నాప్ చేస్తే డబ్బు ఇవ్వక ముందు ఎందుకు వదిలేశారు? ఇలా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.సినిమా పరిస్థితి ఏమిటి?

సినిమా పరిస్థితి ఏమిటి?

జూన్ 30న ‘ఖయ్యూం భాయ్' సినిమా విడుదలైంది. రియల్ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించిన ఈచిత్రం రియాల్టీకి దూరంగా ఉందనే విమర్శలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద కూడా స్పందన అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది.
English summary
Khayyum Bhai movie hero Katta Rambabu and director Bharath Parepally kidnapped and released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X