»   » వాస్తవ సంఘటనల ఆధారంగా ఈసినిమా తీయడం జరిగింది..అందుకే

వాస్తవ సంఘటనల ఆధారంగా ఈసినిమా తీయడం జరిగింది..అందుకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం బాలీవుడ్ లోఏనోట విన్నా ఖేలే హామ్ జీ జాన్ సే సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఈసినిమాలో అభిషేక్ బచ్చన్ ఎప్పుడూ చేయనటువంటి ఓవైవిద్య భరితమైన పాత్రను చేయనున్నారని సమాచారం. ఇక పోతే ఈసినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన అందాల తార దీపికా పదుకోణె నటిస్తున్నారు. వీరిద్దరి మద్య వచ్చేటటువంటి కోన్ని సీన్లు చాలా బాగా రక్తికట్టించాయని సదరు యూనిట్ సభ్యలు చెప్తున్నారు. ఇక ఈసినిమా విషయానికి వస్తే దీనిని పీవిఆర్ పిక్చర్స్, ఆశుతోష్ గోవారికర్ ప్రోడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఈసినిమా డైరెక్టర్ ఆశుతోష్ గోవారికర్ మాట్లాడుతూ ఈసినిమాను శుక్రవారం విడుదల చేస్తున్నామని అన్నారు. ఇక కధ విషయానికి వస్తే సూర్జ్య సేన్ అనే నాయకుడి ఆధ్వర్యంలో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసినటువంటి ఓ బెంగాలీ బృందం పోరాట గాధతో ఈసినిమాని రూపోందించడం జరిగిందని అన్నారు. 1930వ సంవత్సరంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా రూపోందించడం జరిగింది. ఇక ఈసినిమాకి మాణిని ఛటర్జీ రాసినటువంటి డు అండ్ డై అనే పుస్తకం ఆధారంగా తీశామని అన్నారు. ఈచిత్రానికి సంగీతం సోహైల్ సేన్ అందించిన విషయం తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu