చీప్ స్టార్.. అరటి పండ్లు తీయడం మీకు బాగా వచ్చు.. హీరో రవితేజపై డైరెక్టర్ భార్య సెటైర్లు
మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమా నేడు భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదల అవుతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విధానానికి అందరికి ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఆ ఈవెంట్లో రవితేజ మాట్లాడిన విధానం ఎన్నో అనుమానాలను కలుగజేసింది. దర్శకుడు రమేష్ వర్మ కు రవితేజకు మధ్యలో ఏదో గొడవ జరిగింది అని మీడియాలో కథనాలు గట్టిగానే వస్తున్నాయి. ఈ తరుణంలో రమేష్ వర్మ భార్య రేఖ వర్మ(స్వీటీ వర్మ) స్పందించిన విధానం కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంస్టాగ్రామ్ స్టోరీలో రవితేజ ఉద్దేశిస్తూ సెటైరికల్ గా కామెంట్ చేయడం ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే...

రమేష్ వర్మతో రెండో సినిమా
దర్శకుడు రమేష్వర్మ ఇదివరకే రవితేజతో వీర అనే సినిమా చేశాడు. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది. ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఖిలాడి సినిమా గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాని హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. తప్పకుండా సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని కూడా అందరూ నమ్మారు.

రవితేజ షాకింగ్ కామెంట్స్
అంతా సవ్యంగానే కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన విధానం ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలుగ చేసింది. దర్శకుడు రమేష్ వర్మ అలాగే రవితేజకు మధ్యలో ఏదో గొడవ జరిగినట్లు గానే ఉంది అన్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. ఎందుకంటే రవితేజ స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు నిర్మాత కోనేరు సత్యనారాయణ ఉద్దేశిస్తూ మీరు దగ్గరుండి అన్ని చూసుకోవాల్సింది అని అప్పుడే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అని అన్నారు. అంతకుముందే దర్శకుడు మహర్జాతకుడు అంటూ సినిమా విడుదల కంటే ముందే అతనికి కారు కూడా కొని ఇచ్చారు అని రవితేజ కొంత విభిన్నంగానే మాట్లాడాడు.

సినిమా చేయడానికి ప్రధానం కారణం..
ఇక రవితేజ ఎక్కువగా మిగతా యూనిట్ సభ్యులను మాత్రమే పొగిడాడు. ముఖ్యంగా రైటర్ శ్రీకాంత్ విస్సా ప్రత్యేకంగా దగ్గరకు పిలిపించుకుని మరీ ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం ఈ రైటర్ మాత్రమే అని అన్నాడు. అలాగే నిర్మాత గురించి కూడా ఈ సినిమా చేయడం జరిగింది అని పదేపదే రవితేజ చాలా బలంగా వివరణ ఇచ్చాడు. దీంతో దర్శకుడితో కొన్ని తేడాలు వచ్చాయి అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.

రవితేజ.. చీప్ స్టార్..
ఇక ఈ గొడవ జరుగుతున్న తరుణంలోనే రమేష్ శర్మ భార్య సతీమణి రేఖ వర్మ రవితేజ పై కామెంట్ చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో రవితేజను ఉద్దేశిస్తూ.. చీప్ స్టార్ అని ఒక దర్శకుడు అన్నట్లు వివరణ ఇవ్వడం ఓ వర్గం అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది.
గతంలో దర్శకుడు అజయ్ భూపతి చీప్ స్టార్ ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధమయ్యింది అంటూ.. ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు.

అరటిపండు సెటైర్
ఇక మరొక స్టోరీలో అయితే అరటి పండు మీకు బాగా వచ్చు అనుకుంటా తియ్యడం.. డైరెక్టర్ గారు నెక్స్ట్ టైమ్ క్లాసెస్ తీసుకోండి RT దగ్గర. అరటి చెట్టు నరికి ఇచ్చినా సరిపోలేదు.. RT కి అంటూ స్టోరీలో రవితేజ పేరు క్లారిటీ గా చెప్పకుండా సెటైర్ వేశారు. ఇక మరొక స్టోరీలో డైరెక్టర్ కి ఒక స్టైల్ ఉంటది అంటూ అది మీకు చెప్పి చేయిస్తేనే కెమెరాలో యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తావు అని అన్నారు. ఇక ఆ క్రెడిట్ దర్శకుడికే అని కూడా ఆమె తెలియజేశారు.

థియేటర్ లో కలుద్దాం..
ఇక చివరలో రమేష్ వర్మ గురించి మాట్లాడిన రేఖ వర్మ మాస్ నే క్లాస్ చేసిన డైరెక్టర్ అంటూ ఆ విషయం థియేటర్ లో కనిపిస్తుంది అని రేపు థియేటర్ లో కూడా కలుద్దాం అని కూడా తెలియజేశారు. రమేష్ వర్మ భార్య రవితేజ పై ఇలా సెటైరికల్ గా ఎందుకు కామెంట్స్ చేసింది అనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు అసలు ఈ గొడవకు కారణం ఏంటి వారిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయాలు తెలియాలి అంటే అఫీషియల్ గా ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.


Click it and Unblock the Notifications











