twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కిలాడీ గర్ల్ అసిన్ సొల్లు కబుర్లు..!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసిన హీరోయిన్ అసిన్ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి పోవడం, ఆమె హిందీలో చేసిన 'గజనీ' చిత్రం హిట్టవడంతో సౌత్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన తాజా బాలీవుడ్ మూవీ 'కిలాడీ 786' చిత్రం ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆసిన్ తెలుగు సినిమాలో మళ్లీ నటిస్తానని చెప్పుకొచ్చింది.

    తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయని, అయితే తన రీ ఎంట్రీ కోసం తగిన కథలు దొరకడం లేదని, వాటి కోసమే ఎదురు చూస్తున్నానని కహానీలు చెబుతోంది. ఇదంతా కేవలం తన హిందీ సినిమా ప్రచారం కోసమే అసిన్ చెబుతున్న సొల్లు కబుర్లు అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

    గతంలో ఆసిన్ తెలుగులో పూరి జగన్నాథ్ 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం చిత్రాల్లో నటించింది. ఆమె చివరి సారిగా తెలుగులో 2006 సంవత్సరంలో వచ్చిన అన్నవరం చిత్రంలో నటించింది. అప్పటి నుంచి ఆసిన్ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు.

    అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన హిందీ గజిని చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అసిన్ ఇప్పటి వరకు 5 బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఆమె నటించి గజనీ, రెడీ, హౌస్ ఫుల్ 2, బోల్ బచ్చన్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అవడంతో పాటు రూ. 100 కోట్లు క్రాసయ్యాయి. కిలాడీ 786 ఆమె నటిస్తున్న 6వ చిత్రం.

    English summary
    Actress Asin Thottumkal, who is currently busy promoting her next Hindi movie Khiladi 786 with Akshay Kumar, has revealed that she loves Tollywood and she desperately wants to comeback to Telugu films. Although she has been getting offers, she is waiting for a good project for her grand return.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X