ఖిలాడీ దర్శకుడికి బంపర్ ఆఫర్.. సినిమా విడుదలకు ముందే రేంజ్ రోవర్!
ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ హిట్ కొట్టి తమకు లాభాలు అందించిన దర్శకులకి నిర్మాతలు ఖరీదైన కార్లని గిఫ్ట్ గా ఇవ్వడం అనేది ఓ కొత్త ట్రెండ్ లా మారింది. అయితే ఇప్పటిదాకా సినిమా రిలీజ్ అయ్యాక దర్శకులకు గిఫ్టులు ఇచ్చేవారు. కానీ తొలిసారిగా సినిమా విడుదల కూడా కాకముందే ఆ గిఫ్ట్ ఇవ్వడం ఆశ్చర్యకరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఖరీదైన కార్లని
ఈ మధ్య డైరెక్టర్లు సినిమాలు బాగా తీసి రెమ్యునరేషన్ తో పాటు ఖరీదయిన కారులు కూడా అందుకుంటున్నారు. భరత్ అనే నేను సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ కి మహేష్ బాబు కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే ఛలో తో హిట్ కొట్టిన వెంకీ కుడుములకు నాగ శౌర్య కారు గిఫ్ట్ ఇవ్వగా దర్శకుడు మారుతికి సైతం గీత ఆర్ట్స్ నుంచి కొత్త కారు గిఫ్ట్ గా వచ్చింది. ఆరెక్స్ 100 దర్శకుడికి కూడా ఆ సినిమా నిర్మాతలు కారు గిఫ్ట్ ఇచ్చారు. అంతేకాక డైరెక్టర్ బుచ్చి బాబు కి ఉప్పెన బ్లాక్ బస్టర్ అవడంతో మైత్రి వారు కారు గిఫ్ట్ గా ఇచ్చారు.

ఖిలాడీ
అయితే వీరందరికీ సినిమా విడుదల అయ్యాక వారి వారి నిర్మాతల నుంచి ఈ బహుమతులు వచ్చాయి. కానీ ఇప్పుడు రవితేజ ఖిలాడీ దర్శకుడు రమేష్ వర్మ ఖిలాడీ మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే నిర్మాతల నుండి ఓ కారుని గిఫ్ట్ అందుకున్నారు. క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ తో రాక్షసుడు మూవీ తో సూపర్ హిట్ కొట్టిన రమేష్ వర్మ - నిర్మాత సత్యనారాయణలతో కలిసి ఖిలాడీ మూవీ చేస్తున్నారు.

మూడు విభిన్నమైన షేడ్స్ లో
ఈ ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11 న రిలీజ్ కి రెడీ అవుతుంది. దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ఖిలాడీ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట. ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కోసం నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

హక్కులు హాట్ కేకుల్లా
ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కూడా సినిమా మీద వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను మిగతా భాషల్లో కూడా విడుదల చేస్తున్నట్లు చెబుతున్నారు. ఖిలాడీ సినిమా హిందీ రైట్స్ గురించి పెన్ మూవీస్ ట్విట్టర్‌లో స్పందిస్తూ ఈ సినిమా థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ సినిమాపై జనరేట్ అయిన పాజిటివ్ వైబ్స్‌తో చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 11, 2022 రోజున ఖిలాడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది అని వెల్లడించింది.
Recommended Video

రిలీజ్ కి ముందే
ఇక ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్‌ను పెన్ మూవీస్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్టు సమాచారం. అలా తెలుగు మార్కెట్ తో పాటు హిందీలో కూడా మంచి ప్రొడ్యూసర్ హ్యాపీగా ఫీల్ అయ్యి సినిమా రిలీజ్ కి ముందే రమేష్ వర్మకి రేంజ్ రోవర్ గిఫ్ట్ గా ఇచ్చారు. అలా సినిమా రిలీజ్ కంటే ముందే కారు అందుకున్నారు రమేష్ వర్మ.


Click it and Unblock the Notifications











