మరో క్లాసిక్ చిత్రం రీమేక్ కు రంగం సిద్దం
ముంబై : క్లాసిక్స్ రీమేక్స్ సీజన్ నడుస్తోంది. తాజాగా హృషికేష్ ముఖర్జీ దర్శకత్వంలో 33 ఏళ్ల కిందట వచ్చిన చిత్రం 'ఖూబ్‌సూరత్' ని రీమేక్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పట్లో ఈ చిత్రంలో రాకేశ్ రోషన్, రేఖ జంటగా నటించారు. ఇప్పుడీ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. ఈ కొత్త రీమేక్ చిత్రానికి అనిల్ కపూర్ నిర్మాత.
హీరోయిన్ గా సోనమ్ కపూర్ నటించబోతోంది. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ ''కథలోని మూలాన్నీ, ఆత్మను అలాగే ఉంచారు. అయితే చిత్రం నడిచే నేపథ్యాన్ని నేటి వాతావరణానికి తగ్గట్లు మార్చారు. నాటి చిత్రంలో రేఖ నటించిన దాంట్లో నేను పది శాతం చేస్తే చాలు... ఈ సినిమా ఘన విజయం సాధించడం ఖాయం. ఆగస్టు నుంచి చిత్రీకరణలో పాల్గొంటాను''అని వెల్లడించింది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహిస్తారు.
ఇక రీసెంట్ గా...ఛస్మే బద్దూర్ ని తాప్సీ,సిద్దార్ద కాంబినేషన్ లో రీమేక్ చేసారు. అయితే అది ఊహించిన విధంగా విజయం సాధించలేదు. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్లాసిక్ చిత్రం ఛస్మే బద్దూర్ రీమేక్ ఫరవాలేదనిపించుకుని పాసైంది.ముగ్గురు అబ్బాయిలు...ఒకమ్మాయి మధ్య జరిగే ఈ కథలో కాస్త సెక్సీ లుక్ తో పాటు రెగ్యులర్ హీరోయిన్ కాకూడదని ఆయన భావించి తాప్సీని ఎంపికచేసారు.


Click it and Unblock the Notifications











