అభిమానిని: ‘బాద్ షా’ షోపై ఖుష్బూ ఎగ్జైట్‌మెంట్
చెన్నై: ప్రముఖ నటి ఖుష్బూ 'బాద్ షా' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటంపై ఎంతో ఎగ్జైట్‌మెంట్ వ్యక్తం చేసారు. ఖుష్భూ ఇంతలా సంతోష పడటానికి ఓ కారణం ఉంది. ఆమె జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. దీంతో ఫస్ట్ డే టికెట్స్ దొరకడంతో తన ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని వెలుబుచ్చారు.
"guess whaaaaat???will be watching #Badshah tomorrow... my director has surprised me by booking the tickets me being Jr.NTR fan.. so sweet. " అంటూ ఖుష్భూ తన ట్విట్టర్లో ట్వీట్ చేసారు.
సినిమా వివరాల్లోకి వెళితే..హిట్ కోసం దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్, ఆయన అభిమానుల దాహం తీరింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'బాద్ షా' చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీను వైట్ల మార్కు రొటీన్ సినిమాలా ఉన్నప్పటికీ 100శాతం ఎంటర్టెన్మెంట్, హిట్ అని టాక్ బయటకు రావడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా, తమన్ సంగీతం అందించారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.'


Click it and Unblock the Notifications











