బాధగా అనిపించింది: ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ అనంతరం ఖుష్భూ!
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అజ్ఞాతవాసి' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి ఖుష్భూ తన షూటింగ్ ముగిసిన అనంతరం చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.
యూనిట్ సభ్యులను విడిచి వెలుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. చాలా బాధగా అనిపించింది అంటూ ట్వీట్ చేశారు.

కొందరిని విడిచి వెళ్లాలంటే అలానే ఉంటుంది
కొందరిని విడిచి వెళ్లాలంటే బాధగా ఉంటుంది. అజ్ఞాతవాసి సినిమా టీం అలాంటిదే. ఇక్కడ నా చివరి రోజు షూటింగ్ ముగిసింది. వారిని విడిచి వెలుతుంటే నా కళ్ల చెమర్చాయి..... అని ఖుష్బూ ట్వీట్ చేశారు.

పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను
ఈ సినిమాకు పని చేస్తున్న డిఓపి మణికందన్ చాలా మంచి వ్యక్తి.. ‘అజ్ఞాతవాసి' సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని ఖుష్భూ ట్వీట్ చేశారు.

త్రివిక్రమ్ గురించి
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన సింప్లిసిటీ బాగా నచ్చింది. ఆయన యాక్టర్స్ నుండి ది బెస్ట్ నటనను రాబట్టుకునే విధానం బాగా నచ్చింది. ‘అజ్ఞాతవాసి'లో నటించే అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు అని ఖుష్భూ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ లవ్లీ కో స్టార్
పవన్ కళ్యాణ్ లవ్లీ కో స్టార్. నాతో ఎంతో ఆప్యాయంగా ఉన్నందుకు ఆయనకు థాంక్స్. ‘అజ్ఞాతవాసి' చిత్ర యూనిట్‌ను విడిచి వెలుతుంటే ఎంతో మిస్సవుతున్నాను అనే ఫీలింగ్ వస్తోంది అని ఖుష్బూ తెలిపారు.

మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు
హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 2018జ నవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

‘అజ్ఞాతవాసి' మూవీ కథ ఇదేనా? ఆ హాలీవుడ్ మూవీకి స్పూర్తి?
'అజ్ఞాతవాసి' కథపై గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











