‘ఖుషీ’ ఖషీగా.... బీచ్ ఒడ్డున శ్రీదేవి కూతురు హల్ చల్!
శ్రీదేవి కూతురు ఖుషి కపూర్ మోడలింగ్ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతోంది. ఆమె పోస్టు చేసిన బికినీ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి.
Recommended Video

హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉండే ఖుషీ... తన రెగ్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫోటోలు పోస్టు చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తద్వారా సినిమాల్లోకి ఇంకా ఎంటరవ్వక ముందు సెలబ్రిటీ హోదా సొంతం చేసుకుంది.
తాజాగా ఆమె తన స్నేహితులతో కలిసి బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసిన ఫోటోలు పోస్టు చేసింది. మోడలింగ్ రంగం వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న ఖుషీ.... అందుకు తగిన యాటిట్యూడ్, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ బికినీ ఫోటోలు పోస్టు చేసింది.
శ్రీదేవి ఇద్దరు కూతుర్లలో పెద్ద పాప జాన్వి కపూర్ కపూర్ బాలీవుడ్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది. చిన్న పాప ఖుషీ కపూర్ మోడలింగ్ వైపు ఆసక్తి చూపుతోంది. శ్రీదేవి-బోనీ కపూర్ దంపతులు కూడా తమ కూతుళ్లు వారికి ఇష్టమైన ప్రొఫెషన్లోకి వెళ్లేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ... ఖుషీ కపూర్ మోడలింగ్ వైపు ఆసక్తి చూపుతోందని, అందరూ జాన్వి మరియు ఖుషీ కపూర్‌లను ఇండియన్ వెర్షన్ ఆఫ్ 'కెండాల్ అండ్ కైలీ జెన్నర్' అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. కెండాల జెన్నర్, కైలీ జెన్నర్ అమెరికాలో టాప్ మోడల్స్.

ఖుషీ కపూర్
ఖుషీ కపూర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన బికినీ ఫోటో ఇదే. ఖుషీ జోరు చూస్తుంటే ఇండియన్ మోడలింగ్ రంగంలో పెద్ద సంచలనం అయ్యేలా ఉంది.

పిగ్గీ బ్యాక్ రైడ్
లవ్లీ ఖుషీ కపూర్ స్విమ్మింగ్ ఫూల్ లో తన స్నేహితులతో కలిసి పిగ్గీ బ్యాక్ రైడ్ చేస్తున్న దృశ్యం.

స్నేహితులో కలిసి ఎంజాయ్ చేస్తూ...
స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఖుషీ ఖషీగా ఖుషీ కపూర్.....

యంగ్ బ్యూటీ
బాలీవుడ్ సెలబ్రిటీ పిల్లల్లో సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన యంగ్ బ్యూటీల్లో ఖుషీ కపూర్ అదరి కంటే ముందు ఉంది. సోదరి ఝాన్వి కంటే ఖుషీ కపూర్ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

పెద్ద మోడల్ అవ్వాలని డ్రీమ్
ఇండియాలోనే పెద్ద మోడల్ అవ్వాలని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఖుషి కపూర్ ఆశ పడుతోంది. తల్లిదండ్రుల మద్దతు కూడా ఉండటంతో ఆమె తన టాలెంటుతో చెలరేగడమే ఇక ఆలస్యం.

ఖుషి-అలియా
శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ తన ఫ్రెండ్ అలియా కశ్యప్(దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు)తో కలిసి ఇలా....

స్టైల్ ఐకాన్
ఇండియాలో ఇప్పటి వరకు ఎంతో మంది మోడల్స్ స్టైల్ ఐకాన్ గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఈ లిస్టులో ఖుషీ కపూర్ కూడా చేయడం ఖాయం అంటున్నారు మోడలింగ్ రంగానికి చెందిన విశ్లేషకులు.

మనీష్ మల్హోత్రా
కపూర్ సిస్టర్స్ ఇద్దరూ... ఎక్కువగా ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వద్దే తమ దుస్తులు డిజైన్ చేయించుకుంటూ ఉంటారు.

వారిలాగానే..
ఫ్యాషన్ పరంగా అమెరికాలో కెండాల్, కైలీ సిస్టర్స్ ఎంత పాపులర్ అయ్యారో... ఇండియాలో జాన్వి, ఖుషీ కపూర్ అలాగే పాపులర్ అవుతున్నారు.

ఖుషి కపూర్
ఇండియాలోని స్టార్ కిడ్స్ అందరిలోనూ అందం పరంగా, ఫ్యాషన్ పరంగా ఖుషి కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోందనడంలో ఎలాంటి సందేహం లేదు.. మీరేమంటారు?


Click it and Unblock the Notifications











