Hesham Abdul Wahab: ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ ఆ స్టార్ హీరోకు కజిన్? ఆశ్చర్యంగా ఉందే!
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన.. ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా... ఖుషి సాంగ్స్ వినిపిస్తున్నాయి. ఇక సినిమా పాటలు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ.. తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. అంతలా ఈ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దానికి కారణం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. ఇంతకీ ఈయన ఎవరు.. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్లు లేనట్లు.. మలయాళం నుంచి ఎందుకు తీసుకువచ్చారు. ఈయన ఓ స్టార్ హీరోకు కజిన్ కూడా అంట.. ఆ హీరో ఎవరు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇప్పుడు ఎక్కడ చూసిన ఖుషి పాటలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు పాటలు రిలీజ్ చేయగా... నిన్న ఐదో పాటను కూడా రిలీజ్ చేశారు. ప్రతి పాట.. ఒక్కో డైమండ్ అన్నట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాటలు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. దానికి కారణం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హేషన్ అబ్దుల్. ఈయన మలయాళ మ్యూజిక్ డైరెక్టర్.

ఇక హేషమ్ అబ్దుల్.. తొలిసారిగా సాల్ట్ మ్యాంగో ట్రీ సినిమాకు సంగీతం అందించి ఇండస్ట్రీలోకి 2015లో అడుగుపెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలకు మ్యూజిక్ అందించాడు. సింగర్ గా,మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత ఏడాది మలయాళం హృదయం సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేశాడు.

ఇక హృదయం సినిమా మలయాళ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఆకట్టుకున్నాయి. దర్శన అనే సాంగ్ ఇప్పటికి ట్రెండ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఖుషి సినిమాకు మ్యూజిక్ అందించారు.

ఇక ఖుషి ప్రమోషన్స్ లో పాల్గొన్న హేషమ్ అబ్దుల్.. తన గురించి చెప్పుకొచ్చారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు మలయాళ స్టార్ హీరో ఫాహద్ పాజిల్ కజిన్ అవుతారని వెల్లడించారు. ఇక ఆయన ఆటిజం కిడ్స్ కు థెరపీ ఇప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ లో తమన్ అంటే ఇష్టమంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. విజయ్, నాని అంటే ఇష్టమని చెప్పిన హేషన్.. వాళ్లతో వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని వెల్లడించారు. ఇక తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫేవరెట్ హీరోలు అని తెలిపారు.

ఇక ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఖుషి చిత్రం నుంచి ఐదు పాటలు రాగా.. సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. ఖుషి సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో జయరామ్, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, రోహిణి, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











