»   » బాహుబలి...ప్లాప్ అంటూ ప్రచారం చేసింది, ఇప్పుడేమో ఇలా!

బాహుబలి...ప్లాప్ అంటూ ప్రచారం చేసింది, ఇప్పుడేమో ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా రేపు విడుదలవుతుందనగా.... ఈ సినిమా ప్లాప్ అంటూ దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యురాలు, డిస్ట్రిబ్యూటర్ అయిన కిఆరా సందు ట్విట్టర్ లో నెగిటివ్ రివ్యూ రాసింది. సినిమా విడుదల కాకముందే ఆమె ట్విట్టర్ ద్వారా అలాంటి వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. ప్రభాస్, రాజమౌళి అభిమానులు ఆమెపై ఎదురుదాడికి దిగారు.

సినిమాపై ఆమె చేసిన నెగెటివ్ ప్రచారం ఏ మాత్రం ప్రభావం చూపలేదు. టాలీవుడ్ రికార్డులతో పాటు పలు బాలీవుడ్ రికార్డులను బద్దలు కొడుతూ ‘బాహుబలి' దూసుకెలుతోంది. అయితే అప్పుడు ‘బాహుబలి' ప్లాప్ అంటూ ప్రచారం చేసిన ఆమె...ఇపుడు బాహుబలి సినిమాను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్స్ చేసింది.


 Kiaara Sandhu tweet about Baahubali

సినిమా విడుదలకు ముందు గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు...
"ఇండియన్ సినిమా యుఏఈ మ్యాగజైన్ రివ్యూ 2/5. అందమైన సినిమాలో ఆత్మ(కథ) లేదు. చెత్త స్క్రీన్ ప్లే, సంగీతం. ఏవరేజ్ యాక్టింగ్. సినిమా క్రేజ్ దృష్ట్యా బంపర్ ఓపెనింగ్స్ రావొచ్చు. మౌత్ పబ్లిసిటీ.. నెగిటివ్ టాక్.. సినిమాను టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చేయడంలో అడ్డుపడతాయి. యూఏఈలో డిస్ట్రిబ్యూటర్లు బాహుబలి ట్రయల్ షో చూసిన తర్వాత అందరిదీ ఒకటే మాట.. "మెరిసేదంతా బంగారం కాదు. ఏవరేజ్ సినిమా". సినిమా కోసం మీ డబ్బులను వేస్ట్ చేసుకోకండి. ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అంటూ ప్రజలను ఫూల్స్ చేశారు. అందమైన సెట్స్ ఉన్నాయి. కంటెంట్ మాత్రం సున్నా. ప్రభాస్, రానాలకు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులా స్టార్ ఇమేజ్ లేదు. డిజాస్టర్ మూవీ" అంటూ కిఆరా సందు ట్వీట్ చేసింది.

బాహుబలి సినిమా రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు...
‘బాహుబలి' సినిమా తెలుగు సినిమా అభిమానులు గర్వపడేలా ఉంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్లు వసూలు చేసింది అంటూ ట్వీట్స్ చేసింది.


English summary
Kiaara Sandhu tweet about Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu