రాంచరణ్ కోసం బాలీవుడ్ బ్యూటీ రెడీ.. శంకర్ మూవీ కోసం రంగంలోకి టాలెంటెడ్ రైటర్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే సంచలనాలకు వేదికగా మారుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక, హీరోయిన్, ఇతర నటీనటులు ఎంపిక ప్రస్తుతం హాట్ హాట్‌ వార్తగా మారుతున్నది. ఈ సినిమా కోసం రంగంలోకి దిగిన ప్రముఖులు ఎవరంటే...

మరో చందమామ లాంటి గ్లామర్.. మధుమితా హాట్ లుక్స్

అవినీతిపై ఉక్కుపాదం మోపే..

అవినీతిపై ఉక్కుపాదం మోపే..

అవినీతిపై అస్త్రాన్ని సంధించే కథతో వస్తున్న శంకర్ మరోసారి భారతీయుడు, శివాజీ లాంటి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం భారీగా వీఎఫ్ఎక్స్, ఇతర సాంకేతికతను వాడేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం దిల్ రాజు కూడా భారీగా ఖర్చు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా రాంచరణ్

పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా రాంచరణ్

అయితే ఈ చిత్రంలో రాంచరణ్ పోలీస్ ఆఫీసర్‌గా లేదా కలెక్టర్‌గా నటించే అవకాశం ఉందనేది తాజా సమాచారం. ఈ పాత్ర కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఈ పాత్ర స్వరూపాన్ని అర్ధం చేసుకోవడానికి పలువురితో చర్చలు జరుపుతున్నారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అదిరిపోయే డైలాగ్స్ కోసం వివేక్

అదిరిపోయే డైలాగ్స్ కోసం వివేక్

పవర్‌ఫుల్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న రాంచరణ్‌కు మాస్, మసాలా డైలాగ్స్ రాయడానికి టాలెంటెడ్ రైటర్ వివేక్‌ను రంగంలోకి దించారు. కథ, కథనాలు బలంగా ఉండేందుకు ఆయనతో డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాయిస్తున్నారు. వివేక్ విషయానికి వస్తే.. మెర్సల్, బిగిల్, దర్బార్, ఇరంబు థిరై, సోరారై పొట్రూ, జగమే థాందిరాం అనే చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం శంకర్‌తో కలిసి ఈ సినిమాపై కసరత్తు చేస్తున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొన్నాయి.

రాంచరణ్ సరసన కియారా అద్వాని

రాంచరణ్ సరసన కియారా అద్వాని

ఇక రాంచరణ్ సరసన నటించే భామను కూడా ఖారారు చేసినట్టు తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీని ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను జూలై, ఆగస్టు నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

Recommended Video

Harbhajan Singh Says Yes For Ranveer Singh, Geeta Basra Disagrees
సంక్రాంతికి RRRతో చెర్రీ

సంక్రాంతికి RRRతో చెర్రీ

ఇదిలా ఉండగా, రాంచరణ్ నటిస్తున్న RRR చిత్రం షూటింగు దశలో ఉంది. అలాగే నిర్మాతగా రాంచరణ్ నిర్మిస్తున్న ఆచార్య చిత్రం ముగింపు దశలో ఉంది. ఈ రెండు సినిమా షూటింగు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అంతా సవ్యంగా సాగితే RRR చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X