మహేష్ కూతురితో కైరా అద్వానీ.. హైదరాబాద్ చుట్టేసింది!
సూపర్ స్టార్ మహెష్ భరత్ అనే నేను చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి చిత్రంతోనే కైరా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. భారత అనే నేను చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కైరా అద్వానీ మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన బోయపాటి దర్శకత్వంలో నటిస్తోంది.

షూటింగ్ కి కొద్దిగా గ్యాప్ దొరకడంతో ఈ బాలీవుడ్ బ్యూటీ హైదరాబాద్ మొత్తం చుట్టేస్తోంది. సన్నిహితులు, అభిమానులు ఇచ్చిన సలహా మేరకు హైదరాబాద్ లోని చార్మినార్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలన్నీ చూసేసిందట. ఈ విషయాన్ని కైరా అద్వానీ సోషల్ మీడియాలో తెలియజేసింది.
ఇదిలా ఉండగా భరత్ అనే నేను చిత్రంతో కైరా అద్వానీకి, మహేష్ ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తాజాగామహేష్ ఇంటికి కూడా వెళ్ళింది. మహేష్ సతీమణి నమ్రత, కుమార్తె సీతారతో కైరా సరదాగా గడిపింది. ఆ ఫోటోని కూడా కైరా అద్వానీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











