twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ ఇండస్ట్రీలో లైంగిక దాడులు.. చూస్తుంటే! 'మీటూ'పై కియారా షాకింగ్ కామెంట్స్

    |

    సినీ ఇండస్రీలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, నమ్మించి మోసం చేసే కల్చర్ ఉందని ఇప్పటికే ఎందరో హీరోయిన్లు తమ తమ ఆవేదన వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడో హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం.. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇప్పటికే చాలామంది సినీ తారలు స్పందించారు. అయితే తాజాగా మీటూ ఉద్యమం, దాని పరిణామాలపై స్పందిస్తూ ఘాటు కామెంట్స్ చేసింది కియారా అద్వానీ. వివరాల్లోకి పోతే..

     హీరోయిన్లపై లైంగిక దాడులు.. క్రమంగా!

    హీరోయిన్లపై లైంగిక దాడులు.. క్రమంగా!

    ముందుగా బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా ఈ 'మీటూ' ఉద్యమంపై స్పందించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పాపులర్ కావడంతో.. సౌత్‌కు చెందిన చాలామంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి చెప్పడానికి ముందుకొచ్చారు. దీంతో 'మీటూ' ప్రభావం బాలీవుడ్ సహా, ఇతర సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమల్లోనూ కనిపించింది.

    అంతా అదే అనుకున్నారు.. ఇంతలో షాకిచ్చిన కియారా

    అంతా అదే అనుకున్నారు.. ఇంతలో షాకిచ్చిన కియారా

    ఈ నేపథ్యంలో 'మీటూ' ఉద్యమంపై ఇటు జనానికి, అటు సినీ వర్గాల్లో అందరికీ ఓ అవగాహన వచ్చింది. మహిళలు తమపై జరిగిన లైంగిక దాడిని బాహాటంగా చెప్పేందుకు ముందుకు రావడం మొదలైంది. దీంతో ఇండస్ట్రీలో కొంతమేర లైంగిక దాడులు తగ్గాయని టాక్ వచ్చింది. కానీ తాజాగా కియారా మాట్లాడిన మాటలు చూస్తుంటే అదంతా వట్టిమాటేనా! అనిపిస్తోంది.

     'మీటూ' ఎఫెక్ట్.. అనుమానం కలిగించిన బోల్డ్ బ్యూటీ

    'మీటూ' ఎఫెక్ట్.. అనుమానం కలిగించిన బోల్డ్ బ్యూటీ

    ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా.. ఇప్పటికైతే 'మీటూ'తో వచ్చిన మార్పేదీ కనిపించడం లేద‌న్న‌ట్టుగా మాట్లాడారు. 'మ‌నం పోస్ట్ మీ టూ ద‌శ‌కు చేరుకోలేదు' అని ఆమె చెప్పడంతో జనాల్లో మరోసారి 'మీటూ' అంశం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు పలు అనుమానాలకు తావిచ్చింది.

     కియారాపై లైంగిక వేధింపులు?

    కియారాపై లైంగిక వేధింపులు?

    'మీటూ' ఉద్యమం ద్వారా ఫలితం ఉంటుందన్న ఆశ కూడా లేదని కియారా చెప్పడం సినీ వర్గాల్లో సెన్సేషనల్ టాపిక్ అయింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ చూసి.. ఇంకా నటీమణుల మీద లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయా? లేక కియారా ఇలాంటివి ఫేస్ చేస్తోందా? అని చర్చించుకుంటున్నారు సినీ జనం.

     బోల్డ్ బ్యూటీ సత్తా.. బాలీవుడ్ టు టాలీవుడ్

    బోల్డ్ బ్యూటీ సత్తా.. బాలీవుడ్ టు టాలీవుడ్

    ఇకపోతే బాలీవుడ్ టు టాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా భారీ పాపులారిటీ సంపాదించింది కియారా అద్వానీ. తెలుగులో మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాలో నటించిన ఈ భామ, ఆ తర్వాత తిరిగి బాలీవుడ్ తెరపై సత్తా చాటుతోంది. వరుస అవకాశాలు అందుకుంటూ జోష్ లో ఉంది.

    Recommended Video

    8 Reasons Behind Superstar Mahesh Babu Craze || Filmibeat Telugu
     సినిమాలే కాదు.. అందులో కూడా ఫాస్టే!

    సినిమాలే కాదు.. అందులో కూడా ఫాస్టే!

    కియారా సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే కబీర్ సింగ్, గుడ్ న్యూస్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో గిల్టీ అనే సిరీస్‌లో నటిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా తనదైన మార్క్ వేసుకుంది కియారా.

    English summary
    Kiara Advani spoke about Sexual abuse, Sexual harassment and #metoo movement in the film Industry. She says about efect of metoo in film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X