టాలీవుడ్ దర్శకుడు 32 సార్లు ఏడ్పించాడు.. కైరా అద్వానీ

By Rajababu

టాలీవుడ్‌లో యువ హీరోయిన్లకు కొదవేం లేదు. అలా దూసుకొచ్చిన నూతన తారల్లో ప్రతిభావంతురాలు కైరా అద్వానీ. భరత్ అనే నేను చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకొన్నది. మహేష్‌బాబుకు సరైన జోడి అనే బ్రాండ్‌ పేరును సంపాదించుకొన్నది. భరత్ అనే నేను హిట్‌తో రాంచరణ్‌ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది.

రాంచరణ్ సినిమా గురించి

రాంచరణ్ సినిమా గురించి

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య మెగా హీరో రాంచరణ్‌తో రూపొందించే చిత్ర షూటింగ్‌లో కైరా అద్వానీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో భారమైన పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను కైరా వెల్లడించింది.

32 సార్లు ఏడ్పించాడు

32 సార్లు ఏడ్పించాడు

నాపై దర్శకుడు బోయపాటి శ్రీను ఓ భావోద్వేగమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాడు. ఆ సన్నివేశం కోసం 32 సార్లు ఏడ్పించాడు. ఆయన 32 టేక్స్ నా నుంచి తీసుకొన్నారు. సినిమాలో ఆ సన్నివేశం చాలా కీలకమైంది అని కైరా అద్వాని తెలిపింది.

లస్ట్ స్టోరీస్‌తో

లస్ట్ స్టోరీస్‌తో

భరత్ అనే నేను తర్వాత కైరా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే లస్ట్ స్టోరీస్ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. లస్ట్ స్టోరిస్‌లోని ఆమె నటనకు క్రిటిక్స్ ప్రశంసలతో ముంచెత్తారు. లస్ట్ స్టోరిస్ తర్వాత నా జీవితమే మారిపోయిందనే మాటను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇటీవలే 26వ జన్మదినం

ఇటీవలే 26వ జన్మదినం

ఇటీవలే తన 26వ జన్మదినం జరుపుకొన్న కైరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో కాలాంక్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఆ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. రాంచరణ్‌తో సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకొన్నది ఈ అందాల భామ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X