విజయ్ దేవరకొండ అంటే పిచ్చి.. ఆ విషయంలో నేను హ్యాపీ.. కియారా

తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి రీమేక్‌లో నటించే అవకాశాన్ని అందాల నటి కియారా అద్వాని దక్కించుకొన్నది. ఈ సినిమాను శరవేగంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరెకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్‌, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం కియారా నటించిన వినయ విధేయ రామ జనవరి 11న రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ గురించి పలు విషయాలు వెల్లడించింది. ఆమె ఏమన్నారంటే..

విజయ్ దేవరకొండకు ఫ్యాన్‌ను

విజయ్ దేవరకొండకు ఫ్యాన్‌ను

అర్జున్ రెడ్డి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. విజయ్ దేవరకొండ‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన నటన అంటే నాకు పిచ్చి. యాక్టర్‌గా విజయ్ అద్భుతం. హిందీలో అర్జున్‌రెడ్డి రీమేక్‌ కబీర్ సింగ్‌లో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసినంత పనిచేశాను. అర్జున్ రెడ్డి చూసిన వారికి ఎలాంటి నిరాశను కలిగించదు. హిందీ వెర్షన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదే ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశం.

కబీర్ సింగ్ మూవీ అద్భుతంగా

కబీర్ సింగ్ మూవీ అద్భుతంగా

కబీర్ సింగ్ సినిమా షూట్ అద్భుతంగా సాగుతున్నది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మార్చారు. షాలిని పాత్రంటే నాకు చాలా ఇష్టం. షాహీద్, నేను ఆ పాత్రల్లో ఒదిగిపోయాం. మేము నటిస్తున్న తీరుపై దర్శకుడు సందీప్ సంతృప్తికరంగా ఉన్నాడు. అర్జున్ రెడ్డి ఆయన మానస పుత్రిక. ఆ సినిమాకు ఆయనే న్యాయం చేస్తాడని బలంగా నమ్మాను.

 ప్రీతి పాత్ర ఎలా ఉంటుందంటే.

ప్రీతి పాత్ర ఎలా ఉంటుందంటే.

అర్జున్ రెడ్డి సినిమాకు కబీర్ సింగ్ సినిమాకు కంపారిజన్స్ తప్పకు ఉంటాయి. అర్జున్ రెడ్డి సినిమా చూసిన వాళ్లు కూడా హిందీ రీమేక్‌ను మెచ్చుకొంటారు. ప్రీతి పాత్రలో షాలిని పాండే అద్భుతంగా నటించింది. నేను పోషించే ప్రీతి పాత్ర కూడా చాలా అద్బుతంగా ఉంటుంది. మీరు తెరపైన చూస్తే మీకే తెలుస్తుంది.

సందీప్ రెడ్డి హ్యాపీగా

సందీప్ రెడ్డి హ్యాపీగా

ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓ హెవీ సీన్‌ను చిత్రీకరించాల్సి ఉంది. సందీప్ రెడ్డి చాలా హ్యాపీగా ఉన్నారు. హిందీ వెర్షన్‌కు కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అర్జున్ రెడ్డి సినిమా గురించి ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆయన గొప్ప దర్శకుడనడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X