ఆ హీరోతో కియారా అద్వానీ రెండోసారి.. రీమేక్ రాణీగా క్రేజీ ప్రాజెక్ట్‌లోకి బ్యూటీ!
Recommended Video

తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించిన కాంచన చిత్రం హిందీలో రీమేక్ కానున్నది. లక్ష్మీ పేరుతో రూపొందే చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ సరసన కియారా అద్వానీని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు బాలీవుడ్ పత్రికలు వెల్లడించాయి. కియారా, అక్షయ్ జతకట్టడం తొలిసారి కాదు. ప్రస్తుతం వారిద్దరూ గుడ్ న్యూస్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

కాంచన రీమేక్‌లో కియారా
కాంచన రీమేక్‌లో హీరోయిన్‌గా నటించడానికి కియారా అద్వానీ అంగీకరించింది. తుది ఫ్మారాలిటీస్ ముగిసిన తర్వాత త్వరలోనే అధికారికంగా ఆమె పేరును వెల్లడిస్తారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ గుడ్ న్యూస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా షూట్ పూర్తి కాగానే లక్ష్మీ సినిమా పట్టాలెక్కుతుంది.

కాంచన రీమేక్‌తో అక్షయ్ హ్యాప్పీ
అక్షయ్ కుమార్ చాలాకాలంగా కాంచన రీమేక్ చిత్రంలో నటించాలని ఎదురుచూస్తున్నాడు. చివరికి ఆ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కావడంతో ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడా అక్షయ్ ఎదురుచూస్తున్నాడు అని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.

కాంచన కోసం ఆర్ మాధవన్
కాంచన రీమేక్‌లో నటించడానికి ఆర్ మాధవన్‌ను కూడా సంప్రదించారు. ఆయన కూడా ఈ చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు తమిళంలో రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. హిందీలో దర్శకుడి ఎంపిక పెండింగ్‌లో ఉంది అని తెలిపారు.

పలు భారీ చిత్రాల్లో కియారా అద్వానీ
ఇక కియారా విషయానికి వస్తే.. వికీ కౌశల్‌తో కలిసి లస్ట్ స్టోరీస్, రాంచరణ్‌తో వినయ విధేయ రామ చిత్రంలో కనిపించింది. వరుణ్ ధావన్‌తో కాలాంక్, షాహీద్ కపూర్‌తో కబీర్ సింగ్, అక్షయ్ కుమార్‌తో గుడ్ న్యూస్ మూవీలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











