బుట్ట బొమ్మకు షాక్.. మళ్లీ ఆ భామ మీదే మహేష్‌బాబు మోజు!
సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత గీతాగోవిందంతో స్టార్ డైరెక్టర్‌గా మారిన పరుశురాంతో కలిసి ఓ సినిమాకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కి ఉండాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై జాతీయ స్థాయిలో సినీవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇంతకు మహేష్‌తో జతకట్టే హీరోయిన్ ఎవరంటే..

బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు తెరపైకి
పరుశురాం తెరకెక్కించే సినిమా కోసం పూజా హెగ్డే, సమంత అక్కినేని, కీర్తీ సురేష్‌ను సంప్రదించారనే వార్తలు అప్పట్లో టాలీవుడ్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే వాటిపై అంతగా క్లారిటీ లేదనే మాట వినిపించింది. ఈ క్రమంలోనే మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకుండా జాగ్రత్త పడుతున్నది.

కియారా, సారా అలీ ఖాన్
కాగా, మహేష్ సరసన నటించే హీరోయిన్ల పేర్లు కొత్తగా మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. ఒకరు కియారా అద్వానీ కాగా, మరోకరు సారా అలీ ఖాన్ కావడం గమనార్హం. ఇప్పటికే కియారా భరత్ అనే నేను చిత్రంలో మహేష్‌తో నటించి మెప్పించింది. మళ్లీ కియారా అయితే బాగుంటుందనే ఆలోచనలో మహేష్ ఉన్నట్టు సమాచారం.

బాలీవుడ్‌లో బిజీబిజీ
అయితే అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ రిలీజ్ తర్వాత కియారా అద్వానీ బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌తో జతకడుతున్నదనే వార్తలు మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో కియారా అద్వానీ ఒకే చెబుతుందా అనే మరో ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు.
Recommended Video

కియారా ఒప్పుకోకపోతే..
ఒకవేళ కియారా కనుక ఒప్పుకోకపోతే, ఆమెకు బదులుగా సారా అలీఖాన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు సారాతో కూడా చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో త్వరలోనే హీరోయిన్ ఎంపిక గురించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











