ప్రిన్స్ మహేష్ అలాంటోడు.. సెట్లో అలా ఉంటాడు.. కైరా అద్వానీ
టాలీవుడ్‌లో కైరా అద్వానీ ప్రస్తుతం హాట్ హీరోయిన్. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీతో తెర మీదకు దూసుకొచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం ప్రిన్స్ మహేష్‌బాబు పక్కన ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను ఆమె మీడియాతో పంచుకొంటూ ప్రిన్స్‌ను ఆకాశానికి ఎత్తేసింది. ఇంతకు కైరా ఏమన్నారంటే..

మహేష్‌తో వర్క్ చేసే అవకాశం
టాలీవుడ్‌లో వర్క్ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. అందులో ప్రిన్స్ మహేష్ లాంటి హీరోతో నటించే ఛాన్స్ రావడం లక్కీగా ఫీలవుతున్నాను. టీమ్ పనిచేసే విధానం నాకు బాగా నచ్చింది అని కైరా తెలిపింది.

ఆ విషయం ఆకట్టుకొన్నది
భరత్ అనే నేను చిత్ర యూనిట్‌తో ఉన్నంత కాలం షూటింగ్ చేస్తున్నామనే ఫీలింగ్ కలుగులేదు. యూనిట్ సభ్యుల కోఆర్డినేషన్ చాలా బాగుంది. వారి అంకితభావం ఆకట్టుకొన్నది అని కైరా పేర్కొన్నది.

భేషజం కనిపించదు
ప్రిన్స్ మహేష్ సీనియర్ నటుడైనా అలాంటి భేషజాలు ఆయనలో కనిపించవు. టీమ్‌తో చక్కగా కలిసిపోతాడు. మహేష్ ఉంటే సెట్స్‌లో ఓ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని కైరా చెప్పింది. అంతేకాకుండా జోకులు పేల్చుతూ సెట్స్‌లో ప్రతీ ఒక్కరి మూడ్‌ను బాగా ఉండేలా చేస్తాడు అని అన్నారు.

కొత్త హీరోలా చేస్తాడు
మహేష్ సెట్స్‌లో ఉంటే ఎంత హార్డ్ వర్క్ ఉన్నా అది తెలిసేది కాదు. ప్రతీ సీన్‌ను అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోలా చేస్తాడు. ప్రతీషాట్‌ను మానిటర్లో చూసుకొంటాడు. ముఖ్యగా క్లోజప్ షాట్స్‌పై ప్రత్యేకంగా దృష్టిపెడుతాడు అని కైరా చెప్పింది.

వేసవిలో రిలీజ్‌కు సిద్ధం
భరత్ అనే నేను షూటింగ్‌లో ప్రతీ ఒక్కరు ఓ తపస్సు చేస్తున్నట్టు పనిచేశారు అని కైరా తెలిపారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభించింది. వేసవి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నది.

ఎన్టీఆర్, రాంచరణ్‌తో కైరా అద్వానీ
భరత్ అనే నేనుతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నటిస్తున్న చిత్రంలో కూడా కైరా అద్వాని నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా, నాని చిత్రంలోనూ కూడా కైరా ఛాన్స్ కొట్టేసింది.


Click it and Unblock the Notifications











