»   » రాంచరణ్‌పై ప్రశంసలు కురిపించిన మహేష్ హీరోయిన్!

రాంచరణ్‌పై ప్రశంసలు కురిపించిన మహేష్ హీరోయిన్!

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ చూస్తుంటే సౌత్ లో చక్రం తిప్పేలా కనిపిస్తోంది. కైరా అద్వానీ సౌత్ లో నటించిన తొలి చిత్రం విడుదల కాకముందే ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. కైరా అద్వానీ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం భరత్ అనే నేనులో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందే ఈ భామ తెలుగులో మరో క్రేజీ ఆఫర్ ని దక్కించుకుంది.

బోయపాటి శ్రీను, రాంచరణ్ కాంబోలో తెరకెక్కే చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను చిత్రం విడుదలకు కైరా అద్వానీ ఎదురుచూస్తోంది. ఎమ్ ఎస్ ధోని చిత్రంతో కైరా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా కైరా అద్వానీ రాంచరణ్ పై ప్రశంసలు కురిపించింది.

Kiara Advani praises Mega Power Star Ram Charan

తాను రాంచరణ్ గురించి చాలా మంచి విషయాలు విన్నానని తెలిపింది. రాంచరణ్ తో నటించే చిత్రంలో ఈ నెల నుంచే షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు కైరా తెలిపింది. చరణ్ తో కలసి నటించడానికి తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లు కైరా ఇంటర్వ్యూ లో తెలిపింది. కైరా నటిస్తున్న రెండు చిత్రాలు విజయం సాధిస్తే ఆమె తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం.

English summary
Kiara Advani praises Mega Power Star Ram Charan. She is looking forward to Ram Charan movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X