ముద్దుసీన్లా.. అసౌకర్యంగా ఫీలైన కియారా.. ఆసక్తికరంగా స్టార్ హీరో రియాక్షన్
కథ డిమాండ్ చేస్తే హీరోయిన్ ఎలాంటి సీన్స్ లోనైనా నటించాల్సిందే. గ్లామర్ రంగమే అలాంటిది. పైగా ఈ రోజుల్లో సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలే హైలైట్ అవుతున్నాయి. ముద్దు సీన్లు, హీరో హీరోయిన్ రొమాన్సే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దర్శకనిర్మాతలు తమ తమ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ తగిన విధంగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే సెట్స్‌పై ఏ బెరుకు లేకుండా లిప్ లాక్స్, రొమాన్స్ చేసినప్పటికీ వాటి గురించి అందరి మధ్యలో మాట్లాడటం కాసింత సిగ్గుగానే ఉంటుంది. అలాంటి ఓ అబుభవమే ఎదురైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి.
చిన్న సినిమాగా విడుదలై టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ నయా ఒరవడికి శ్రీకారం చుట్టింది అర్జున్ రెడ్డి చిత్రం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై, అందులోని ముద్దు సీన్లపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. రచ్చ పెరుగుతుంటే కలెక్షన్స్ పెరిగి చివరకు బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది అర్జునరెడ్డి. ఈ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేలకు మంచి కెరీర్ ఇచ్చిందీ చిత్రం.

దీంతో ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీ ఈ సినిమా రీమేక్ బాధ్యతలను సందీప్ రెడ్డి వంగానే చేపట్టారు. కబీర్ సింగ్ అనే పేరుతో షాహిద్ కపూర్, కియారా అద్వానీలను హీరో హీరోయిన్లుగా తీసుకొని సినిమా పూర్తిచేస్తున్నారు. ఇటీవలే కబీర్ సింగ్ ట్రైలర్ కూడా విడుదల చేసి భారీ అంచనాలు క్రియేట్ చేశారు. అయితే ఈ ట్రైలర్‌లో షాహిద్, కియారాలు లిప్‌లాక్స్ వరద పారించడంతో యువత పిచ్చెక్కిపోయింది. కాగా ఈ ట్రైలర్ లాంచ్ వేదికపై కియారాకు ఊహించని ప్రశ్న ఎదురుకావడంతో ఆమెకు ఏం మాట్లాడాలో తోచలేదు. దీంతో వెంటనే మైక్ తీసుకున్న షాహిద్ కపూర్ సందర్భానుసారంగా స్పందించారు.
ముద్దు సీన్లలో నటించినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మేడం? అని ఓ విలేకరి ప్రశ్నించడంతో కియారా అసౌకర్యంగా ఫీలై ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. అయినా సదరు కార్యక్రమంలో ఇదే ప్రశ్నతో కియారాను మరింత ఇబ్బందిపెట్టారు మీడియా ప్రతినిధులు. దీంతో వెంటనే మైక్ తీసుకున్న షాహిద్ కపూర్.. మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ముద్దు సీన్లా గురించి వదిలేయండి. ఇంకేదైనా అడగండని అనడంతో కియారా కాస్త రిలాక్స్ అయింది. గతంలో ఓ వెబ్ సిరీస్‌లో కూడా కియారా రెచ్చిపోయి నటించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి కబీర్ సింగ్‌లో కియారా రొమాన్స్ ఎలా ఉండనుందో! జూన్ 21 వ తేదీన కబీర్ సింగ్ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











