కియారా పదో తరగతి ప్రేమ.. ఆ రోజుల్లోనే పని కానిచ్చేసిందట.. ఇప్పుడు కష్టం అంటోంది
కియారా అద్వానీ.. టాలీవుడ్ టు బాలీవుడ్ అస్సలు పరిచయం అక్కెరలేని పేరు. కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ జనం మనసు దోచుకున్న ఈ భామ.. టాలీవుడ్ జనాన్ని కూడా వదల్లేదు. అయితే అందరి జీవితంలో ఉన్నట్లే తన జీవితంలో కూడా ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉందంటోంది కియారా అద్వానీ. తన తాజా సినిమా కబీర్ సింగ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చింది కియారా. ఆ లవ్‌లో ట్విస్టులు కూడా చెప్పి ఆశ్చర్య పరిచింది. వివరాల్లోకి పోతే..

తెలుగు అగ్ర హీరోలను వదలలేదు
మహేష్ హీరోగా వచ్చిన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తనలోని టాలెంట్ చూపించి మైమరిపించింది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ' సినిమాలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేసినప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. అయినప్పటికీ కియరాకు అవకాశాల వరద మాత్రం ఆగటం లేదు. కెరీర్ ఆరంభంలోనే తెలుగు అగ్ర హీరోలతో నటించడం కారణంగా ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

సెన్సేషనల్ వెబ్ సిరీస్.. ముద్దుల కబీర్ సింగ్
తనలో హాట్ నెస్ డోస్ చాలా ఎక్కువని ఉత్తర, దక్షిణాది ప్రేక్షకులందరికీ తెలిపిన కియారా.. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు మైకం కమ్మించినంత పని చేసింది. ఈ వెబ్ సిరీస్ లో సెల్ఫ్ సెక్సువల్ ఫీలింగ్స్ తో ఎంజాయ్ చేసే యువతిగా కియారా భేష్ అనిపించుకుంది. ఆ తర్వాత కబీర్ సింగ్ అనే సినిమాలో హీరోతో రెచ్చిపోయి ముద్దుల్లో మునిగితేలుతోంది కియారా.

పదో తరగతి లోనే పడిపోయా
కబీర్ సింగ్ విడుదలకు సిద్ధం కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పదో తరగతి ప్రేమ ముచ్చట్లు చెప్పిందీ బాలీవుడ్ బ్యూటీ. తాను 10వ తరగతిలో ఉన్న సమయంలో ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానని పేర్కొంటూ ఆ ప్రేమలో ట్విస్టులు, ఆసక్తికర విషయాలను పంచుకుంది కియారా అద్వానీ.

ఈ వయసులో ఆ పని ఏంటి? అని మందలింపులు
''పదో తరగతిలో నా ప్రేమ సంగతి తెలుసుకున్న మా అమ్మ చదువుపై దృష్టి పెట్టమంటూ కోపంగా మందలించింది. ఈ వయసులో అలాంటి పనులు కరెక్ట్ కాదని చెప్పడంతో అతినికి బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. అలా చిన్నప్పుడే ఆ పని పూర్తిచేశా. ఇక ఇప్పుడు లవ్ చేద్దామన్నా సమయం లేదు'' అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది కియారా.

కబీర్ సింగ్ ముద్దులు.. హాట్ టాపిక్
చిన్న సినిమాగా విడుదలై టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ నయా ఒరవడికి శ్రీకారం చుట్టింది అర్జున్ రెడ్డి చిత్రం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై, అందులోని ముద్దు సీన్లపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు రెచ్చిపోయి ముద్దులు పెట్టుకోవడం బాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 21 వ తేదీన కబీర్ సింగ్ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











