ఫ్యాన్స్‌కి కూడా తెలియకుండా రాంచరణ్ ఆ పని చేస్తున్నాడు.. చాలా సీక్రెట్‌గా.. కైరా అద్వానీ!
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. జనవరి 9న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం మొదలు కొని భారీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్ట, రాంచరణ్ వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా చిత్రాల స్టార్స్ అంతా ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. వినయ విధేయ రామ చిత్రంలో రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటించిన కైరా అద్వానీ ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది. కైరా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాంచరణ్ గురించి ఎవరికీ తెలియని విషయాన్ని ప్రస్తావించింది.

మాస్ ఎంటర్‌టైనర్
బోయపాటి శ్రీను దర్శత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాంచరణ్ పోరాటాలు, డాన్సులు, కైరా అద్వానీ గ్లామర్, వివేక్ ఒబెరాయ్ పవర్ ఫుల్ విలన్ గా నటన ఈ అంశాలన్నీ ఆకర్షణగా మారనున్నాయి. రాంచరణ్ కండలు తిరిగిన శరీరంతో యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సోషల్ మీడియాకు దూరంగా
ప్రస్తుతం ఉన్న హీరోలంతా అభిమానులకు చేరువగా ఉండేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ని ఎంచుకుంటున్నారు. కానీ రాంచరణ్ మాత్రం అంతగా సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం లేదు. రాంచరణ్ కు ఫేస్ బుక్ లో మాత్రమే అధికారిక అకౌంట్ ఉంది. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో చరణ్ లేడు. రాంచరణ్ సోషల్ మీడియా గురించి కైరా అద్వానీ వల్లే చర్చ మొదలైంది.

అభిమానులకు కూడా తెలియకుండా
వినయ విధేయ రామ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కైరా అద్వానీ షాకింగ్ సీక్రెట్ ని బయట పెట్టింది. రాంచరణ్ సీక్రెట్ గా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఉపయోగిస్తున్నాడట. ఎవరికీ ఈ విషయం తెలియదు. సీక్రెట్ అకౌంట్ ద్వారా రాంచరణ్ అప్డేట్స్, ఫోటోలు చూస్తూ ఉంటాడు అని కైరా తెలిపింది. ఇంస్టాగ్రామ్లో సమయం గడపడం అంటే చరణ్ కు చాలా ఇష్టం అని కైరా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

వేట మొదలు పెట్టారు
కైరా అద్వాని ఇలా చెప్పిందో లేదో చరణ్ ఫ్యాన్స్ అంతా అతడి ఇంస్టాగ్రామ్ అకౌంట్ కోసం కోసం వేట మొదలు పెట్టారు. ఉపాసన, కైరా అద్వానీ అకౌంట్స్ లోకి వెళ్లి వాళ్ళేమైనా చరణ్ అకౌంట్ ని ఫాలో అవుతున్నారేమో అని వెతుకుతున్నారు. వినయ విధేయ రామ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిడివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధుమిత కీలక పాత్రలో నటించారు.


Click it and Unblock the Notifications











