అవును అతన్నే చేసుకుంటా.. డేటింగ్‌పై స్పందించిన లస్ట్ భామ కియారా

నేటితరం హీరోయిన్లకు డేటింగ్ సంబంధిత వ్యవహారాలు కామన్ అయ్యాయి. ఎందరో హీరో హీరోయిన్లు డేటింగ్ చేసుకోవడం, ఆ తరువాత బ్రేకప్ చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో మాత్రం డేటింగ్‌కి సంబంధించి తప్పుడు వార్తలు రావడం, అవి ఫేక్ అని తేలడం జరుగుతుంటాయి. ఈ కోవలోనే తాజాగా తనపై వస్తున్న డేటింగ్ వార్తలు ఫేక్ అని కొట్టిపారేసింది కియారా అద్వానీ.

 సిద్ధార్థ్‌ మల్హోత్రాతో లవ్ ఎఫైర్

సిద్ధార్థ్‌ మల్హోత్రాతో లవ్ ఎఫైర్

హీరోయిన్ కియారా అద్వానీకి సిద్ధార్థ్‌ మల్హోత్రా అనే నటుడితో కొంత కాలంగా లవ్ ఎఫైర్ నడుస్తోందని, వీరిద్దరూ ప్రేమ మత్తులో మునిగితేలుతూ డేటింగ్ చేస్తున్నారని తెగ వార్తలు షికారు చేస్తున్నాయి. పలు పార్టీల్లో చెట్టాపట్టాలేసుకు తిరగటం, ఇటీవలే కియారా పుట్టిన రోజున సిద్దార్థ్ హంగామా చేయడం లాంటి పరిణామాలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఖచ్చితంగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా

ఖచ్చితంగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా

దీంతో తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియాతో ముచ్చటించిన కియారా.. తనపై, తన డేటింగ్ పై వస్తున్న వార్తలను ఖండించింది. తాను సిద్ధార్థ్‌తో డేటింగ్‌లో ఉన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని కొట్టిపారేసింది కియారా. కాకపోతే తాను ఖచ్చితంగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని, ప్రస్తుతం మాత్రం సింగల్ అని తెలిపింది కియారా.

పదో తరగతి ప్రేమ.. బ్రేకప్

పదో తరగతి ప్రేమ.. బ్రేకప్

కాగా గతంలో కబీర్ సింగ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కియారా తన పదో తరగతి ప్రేమ ముచ్చట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాను 10వ తరగతిలో ఉన్న సమయంలో ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానని పేర్కొంటూ ఆ ప్రేమలో ట్విస్టులు, ఆసక్తికర విషయాలను తెలిపిన కియారా.. తమ తల్లిదండ్రులు మందలించడంతో బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని పేర్కొంది.

వరుస కమిట్‌మెంట్స్.. ఆ తేడానే లేదు

వరుస కమిట్‌మెంట్స్.. ఆ తేడానే లేదు

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా కియారా వరుస కమిట్‌మెంట్స్ ఇస్తోంది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. హిందీలో కబీర్ సింగ్ సినిమాతో స్టార్ స్టేటస్ పట్టేసింది. ఈ సినిమాలో కియారా అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ అమ్మడు 'ఇందూ కీ జవానీ'తో పాటు 'లక్ష్మి బాంబ్' సినిమాలో నటిస్తోంది. తెలుగులో కూడా కొన్ని కథలను పరిశీలనలో పెట్టిందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X