అప్పుడే గనక స్వయంతృప్తి పొందకపోయుంటే ఇప్పుడు నా పరిస్థితి..! కియారా షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం కియారా అద్వానీ. చేసింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోయిన్‌గా క్రెడిట్ కొట్టేసింది కియారా. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం, సీన్ లో జీవించి నటించడం ఆమె లోని బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అయితే కేవలం సినిమాలతో పాటు కియారా చేసిన లస్ట్ స్టోరీస్‌ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వెబ్ సిరీస్ చేసిన క్యారెక్టర్, పండించిన హావభావాలు సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో లస్ట్ స్టోరీస్‌లో క్యారెక్టర్, అదే చేయకపోతే తన పరిస్థితి అంటూ ఆసక్తికరంగా స్పందించింది కియారా. ఇంతకీ ఆమె చెప్పిన సంగతులేంటి? వివరాల్లోకి పోతే..

మహేష్ బాబు, రామ్ చరణ్‌లతో రొమాన్స్

మహేష్ బాబు, రామ్ చరణ్‌లతో రొమాన్స్

బాలీవుడ్ భామగా టాలీవుడ్‌లో కాలుమోపి మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ చిత్రాల్లో నటించి మెప్పించింది కియారా. ఈ రెండు సినిమాల్లో కియారా గ్లామర్ డోస్ తెలుగు ప్రేక్షకులకు కొత్త టేస్ట్ పరిచయం చేసింది. అందంతో పాటు అందుకు తగ్గ అభినయం చూపిన ఈ భామ తెలుగు ఆడియన్స్ చేత భేష్ అనిపించుకుంది.

లస్ట్ స్టోరీస్‌లో కియారా అద్వానీ.. షాకైన నెటిజన్స్

లస్ట్ స్టోరీస్‌లో కియారా అద్వానీ.. షాకైన నెటిజన్స్

నటన అంటే కేవలం సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లు అందులో భాగమే అంటూ లస్ట్ స్టోరీస్‌ అనే వెబ్ సిరీస్‌లో సెన్సేషనల్ క్యారెక్టర్ చేసి వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. ఇందులో స్వయంతృప్తి పొందే గృహిణిగా కియారా చూపిన అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ రకంగా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ పై కూడా తన టాలెంట్ చూపించింది కియారా.

ఆ స్వయంతృప్తి పొందకపోయుంటే ఇప్పుడు

ఆ స్వయంతృప్తి పొందకపోయుంటే ఇప్పుడు

కాగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో లస్ట్ స్టోరీస్‌ వెబ్ సిరీస్, దాని వల్ల జరిగిన పరిణామాలు వివరించింది. కెరీర్ ఆరంభంలో చాలా కష్టాలు పడ్డానని, ఆడిషన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగే దానినని, అయితే ఎప్పుడైతే లస్ట్ స్టోరీస్‌ వెబ్ సిరీస్ చేశానో అప్పటి నుంచి తన కెరీర్ టర్న్ అయిందని చెప్పింది కియారా. లస్ట్ స్టోరీస్‌‌లో ఆ స్వయంతృప్తి పొందకపోయుంటే ఇప్పుడు తన కెరీర్ ఇలా ఉండకపోయిండేది కాదేమో అని చెప్పుకొచ్చింది కియారా.

కబీర్ సింగ్ ఎఫెక్ట్

కబీర్ సింగ్ ఎఫెక్ట్

బాలీవుడ్ లో ఇటీవలే విడుదలైన కబీర్ సింగ్ మూవీ కియారాను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ కెమిస్ట్రీ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటికే 250 కోట్ల క్లబ్‌లో చేరి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X