twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kiara Advani's Shershaah అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్.. లైవ్ అప్‌డేట్స్

    |

    బాలీవుడ్ తారలు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన షేర్షా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. శివ్ పండిట్, రాజ్ అర్జున్, ప్రణయ్ పంచౌరీ, హిమాంషు అశోక్ మల్హోత్రా, నిక్తిన్ ధీర్, అనిల్ చరన్‌జిత్, సాహిల్ వేద్, షాతాఫ్ పిగర్, పవన్ చోప్రా నటించారు.

    Kiara Advanis Shershaah

    కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా ధైర్య సాహాసాలను వెండితెర మీద అద్బుతంగా చెప్పేందుకు చేసిన ప్రయత్నమే షేర్షా. తమిళంలోను, తెలుగులో పంజా సినిమాకు దర్శకత్వం వహించిన విష్ణు వర్ధన్ ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై క్రేజ్‌ను, అంచనాలను పెంచాయి.

    షేర్షా సినిమాను వాస్తవానికి థియేటర్‌లో రిలీజ్ చేయాలని భావించారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విశేషాలు ఎలా ఉన్నాయంటే...

    1

    కార్గిల్‌లో యుద్దం సీన్‌తో కథను మొదలు పెట్టారు. పాకిస్థాన్ తీవ్రవాదుల నుంచి కాల్పులు జరుగుతుంటే బాంబు విసిరేందుకు విక్రమ్ బాత్రా (సిద్ధార్థ్ మల్హోత్రా) పరుగులు పెట్టాడు. శత్రువులు కాల్పులు జరుపుతుంటే లెక్క చేయకుండా పరిగెత్తడంతో కథ ఫ్లాష్ బ్లాక్‌లోకి వెళ్లింది.

    2.

    విక్రమ్ బాత్రాకు సంబంధించిన బాల్యం స్టోరీ మొదలైంది. తనదనుకొంటే దేనిని వదలడనే కాన్సెప్ట్‌తో విక్రమ్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేశారు.

    3.

    23 ఏళ్ల తర్వాత ఆర్మీలో చేరి కశ్మీర్‌లో పోస్టింగ్ రావడంతో అక్కడ డ్యూటీలో చేరారు. నెల రోజుల తర్వాత తీవ్రవాదులతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్ కొంత ఎమోషనల్ కంటెంట్‌ను మూవీలో జొప్పించింది.

    4.

    ఆ తర్వాత తన ప్రేయసి (కియారా అద్వానీ) రాసిన లెటర్ రావడంతో కథ మళ్లీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లింది. కియారా అద్వానీతో ప్రేమ, పాట సీన్లతో నింపాదిగా కథ సాగింది.

    5.

    డింపుల్, విక్రమ్ ప్రేమ వ్యవహారాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారు. అయితే డింపుల్ తండ్రి ఒప్పుకోకపోతే.. చేసుకొంటే విక్రమ్‌ను చేసుకొంటా లేదంటే ఎవర్నీ పెళ్లి చేసుకొని చెబుతుంది. దాంతో మళ్లీ కథ కార్గిల్‌ ప్రాంతానికి వెళ్తుంది.

    Kiara Advanis Shershaah

    6.

    టెర్రిరిస్టు హైదర్ జరిపిన దాడిలో తన స్నేహితుడు మరణించడం, అతడి ఆర్నెళ్ల బాబు ఫోటో చూసి విక్రమ్ ఎమోషనల్ అవుతాడు.

    7.

    తన స్నేహితుడి మరణానికి ప్రతీకారానికి బదులుగా ఆపరేషన్‌ను విక్రమ్ చేపడుతాడు. తన పై అధికారులు తనకు నచ్చిన టీమ్ తీసుకోమని చెబుతారు. అలా హైదర్ మట్టుపెట్టేందుకు ఆపరేషన్ చేపడుతాడు. ఆ ఆపరేషన్‌లో హైదర్‌ను మట్టుపెట్టడంతో విక్రమ్‌కు మంచి పేరు వస్తుంది. ఆ తర్వాత సెలవులపై ఇంటికి వస్తాడు. ఆ తర్వాత డింపుల్‌తో రొమాంటిక్ సాంగ్.. తో కథ ముందుకు వెళ్తుంది.

    8.

    హైదర్ మరణం తర్వాత పాకిస్థాన్ నుంచి టెర్రరిస్టులు భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి విధ్వంసానికి సిద్ధమవుతారు.

    9.

    భారత్, పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. దాంతో మళ్లీ తన క్యాంప్‌కు బయలుదేరుతాడు. ఈ క్రమంలో డింపుల్ నిరాశకు గురవుతుంది. ఈసారి వచ్చినప్పుడు నీవు నా వాడికి కావాలంటే.. డింపుల్ నుదుట తిలకం దిద్ది ప్రేమను కురిపిస్తాడు. అలా డింపుల్ కన్నీరు పెడుతుండగా.. విక్రమ్ తన క్యాంపుకు బయలుదేరుతాడు.

    Kiara Advanis Shershaah

    10.

    గుమ్రా బేస్‌లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండేజ్, ప్రధాని వాజ్‌పేయ్ యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఈ క్రమంలో విక్రమ్ ఉన్న క్యాంప్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేస్తుంది. ఆ దాడుల్లో భారీగా సైనికుల ప్రాణ నష్టం జరుగుతుంది.

    11

    పాక్ సైనికలులను మట్టుపెట్టి ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు లెఫ్టినెంట్ నుంచి కెప్టెన్‌గా ప్రమోషన్ లభించడమే కాకుండా మహావీర్ చక్ర అవార్డుకు రికమండ్ చేస్తారు.

    12.

    ఆ తర్వాత పాలంపూర్‌కు సమీపంలోని పాయింట్ 4875పై భారత సేనలు గురిపెడుతారు. అక్కడ నుంచి పాక్ సేనలను తరిమి కొడితే.. ఇక భారత్‌కు 70 కిలోమీటర్ల మేర అధిపత్యం లభిస్తుంది. ఆ ఆపరేషన్ చాలా కష్టంగా ఉండటంతో భారత్ సైనికులకు భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది.

    English summary
    Kiara Advani's Shershaah social media review and release live updates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X