For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాప్‌లో కుర్రాడిని పట్టేసి డేటింగ్‌ మజా చూస్తా.. బోల్డ్ బ్యూటీ కియారా అద్వానీ

  |

  బోల్డ్ బ్యూటీగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు కవ్వించింది కియారా అద్వానీ. ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు రెడీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు డేటింగ్ చేస్తానని అంటోంది. అదికూడా మొబైల్ యాప్‌లో నచ్చిన కుర్రాడిని ఎంచుకొని. నిజంగా కియారాకి ఇది డేరింగ్ స్టెప్పే అని చెప్పుకోవచ్చు. హీరోయిన్లు డేటింగ్ చేయడం అనేది సాధారణమే. కానీ ఓ క్రేజీ హీరోయిన్ ఇలా మొబైల్ యాప్ ద్వారా ఓ అబ్బాయిని ఎంచుకొని డేటింగ్ చేయడమంటే సాహసమే మరి. ఇంతకీ కియారా ఎందుకీ విషయం బయటపెట్టింది? అసలు సంగతి ఏంటి? వివరాల్లోకి పోతే..

  డిమాండ్ ఉండాలే గానే దేంట్లోనైనా

  డిమాండ్ ఉండాలే గానే దేంట్లోనైనా

  సినిమాల్లో పాత్రల ఎంపిక విషయంలో కియారా అద్వానీ రూటే సపరేటు. పాత్ర డిమాండ్ చేయాలే గానీ ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికైనా రెడీ అంటుంది కియారా. పైగా అది సినిమానా లేక వెబ్ సిరీసా అనే వ్యత్యాసం కూడా చూడకుండా బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు సైతం ముందుకొస్తుంది. ఇప్పటికే లస్ట్ స్టోరీస్ ద్వారా కియారా డేరింగ్ నెస్ అందరికీ అర్థమై పోయింది.

  షాహిద్ కపూర్‌తో రెచ్చిపోయి ముద్దుల మురిపెం

  షాహిద్ కపూర్‌తో రెచ్చిపోయి ముద్దుల మురిపెం

  ఇక ఇటీవలే వచ్చిన కబీర్ సింగ్ సినిమాలో హీరో షాహిద్ కపూర్‌తో రెచ్చిపోయి ముద్దుల వర్షంలో తడిసి ముద్దై పోయింది బోల్డ్ బ్యూటీ కియారా. తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాలో ప్రీతి క్యారెక్టర్‌ని మరిపించేలా తెగ రొమాన్స్ చేసి బాలీవుడ్ ఆడియన్స్‌కి వల వేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడేమో మరో డిఫెరెంట్ క్యారెక్టర్ కోసం రెడీ అవుతోంది. మోడ్రెన్ అమ్మాయిగా మొబైల్ యాప్ ద్వారా నచ్చిన అబ్బాయిని ఎంపిక చేసుకొని డేటింగ్ చేయనుందట కియారా.

  కుర్రాడిని పట్టేస్తా.. డేటింగ్‌కి రెడీ

  కుర్రాడిని పట్టేస్తా.. డేటింగ్‌కి రెడీ

  'ఇందూ కీ జవానీ' అనే కొత్త సినిమాలో నటించబోతోంది కియారా. ఇందులో ఓ మోడ్రెన్ యువతిగా కనిపించనున్న కియారా.. మొబైల్ యాప్ ఉపయోగించి తనతో డేటింగ్ చేయబోయే కుర్రాడిని పట్టేస్తుంది. అతనే హీరో ఆదిత్య సియల్. ఈ ఇద్దరూ కలిసి వెండితెరపై డేటింగ్ చేసి కనువిందు చేయనున్నారు. ఏజ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా మోడ్రెన్ అమ్మాయిల తీరు, దాని వల్ల వారు ఎదుర్కొనే పరిణామాలు చూపించనున్నారని తెలుస్తోంది.

  స్నేహితులు చెబుతుంటే నవ్వొచ్చేది

  స్నేహితులు చెబుతుంటే నవ్వొచ్చేది

  వెండితెరపై డిఫెరెంట్ రోల్స్ చేయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న కియారా.. నిజ జీవితంలో మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటుందట. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె.. తాను రియల్ లైఫ్‌లో ఎప్పుడు కూడా డేటింగ్‌ యాప్స్‌ ఉపయోగించలేదని చెప్పింది. కాకపోతే అలాంటి వాటిలో అకౌంట్స్‌ ఉన్న కొందరు స్నేహితులు దాని గురించి చెబుతుంటే విని నవ్వొచ్చేదని కియారా తెలిపింది.

  వరుస కమిట్‌మెంట్స్.. తేడా లేదు

  వరుస కమిట్‌మెంట్స్.. తేడా లేదు

  టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా కియారా వరుస కమిట్‌మెంట్స్ ఇస్తోంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. కబీర్ సింగ్ సినిమాతో స్టార్ స్టేటస్ పట్టేసింది. ఈ సినిమాలో కియారా అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ప్రస్తుతం కియారా.. 'ఇందూ కీ జవానీ'తో పాటు 'లక్ష్మి బాంబ్' సినిమాలో నటిస్తోంది. తెలుగులో కూడా కొన్ని కథలను పరిశీలనలో పెట్టింది.

  English summary
  Bollywood star heroine Kiara Advani palyed leed role in Arjun Reddy remake Kabir Singh. In this movie Kiara Advani appeared bold character and it helps her career. In latest interview Kiara Advani says about her upcoming movie Indu ki Jawani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X