సీతగా కియారా... కీర్తీని పక్కన పెట్టేస్తున్న ఆదిపురష్...!
డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్ గురించి రోజుకొక వార్త ట్రెండ్ అవుతూనే ఉంది. లీడ్ రోల్ కు తిరుగులేకపోవడంతో, ఇప్పుడు ఇతర ముఖ్యపాత్రలపై జనాల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సీతగా కీర్తి సురేశ్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ అన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, సీత పాత్రపై మరోసారి చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది.
సీతమ్మ పాత్రలో కీర్తి సురేశ్ నటించబోతోంది అన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానులు ఆల్రెడీ ఆమెను ఆ పాత్రలో ఊహించేసుకుంటున్నారనే చెప్పాలి. అయితే, తాజాగా కియారా అద్వానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. సీత పాత్రకు కావాల్సిన లక్షణాలన్నీ కియారాలో పుష్కలంగా ఉన్నాయని దర్శక-నిర్మాతలు భావిస్తున్నారట.
ప్రభాస్ -ఓమ్ రౌత్ కలయికలో తెరకెక్కుతున్న ఆదిపురుష్, టీ సిరీస్ పతాకం పై రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో టీ- సిరీస్ వారు నిర్మించిన కబీర్ సింగ్ సినిమాలో కియారా అద్వాని హీరోయన్ గా నటించింది. ఈ అభిమానంతోనే అదిపురుష్ లోనూ ఆమెనే హీరోయిన్ గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారన్నది తాజా విశేషం.

అయితే క్రియేటివ్ టీమ్ కీర్తీ సురేశ్ కే మగ్గుచూపుతున్నట్లు వినిపిస్తుండగా, కియారాకు కూడా గట్టిగానే మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇద్దరు టాలెంటెడ్ బ్యూటీల నడుమ సాగుతున్న ఈ పోటీలో ఎవరు పై చేయి సాధించి సీతమ్మగా అలరిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











