twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HIndi భాషపై సుదీప్ కామెంట్స్.. అజయ్ దేవగన్ స్ట్రాంగ్ కౌంటర్.. ముదురుతున్న వివాదం!

    |

    ఇప్పుడు తెలుగు సహా దక్షిణాది సినిమాలు హిందీలో కూడా సత్తా చాటుతున్న క్రమంలో హిందీ హీరోలు కొంత మంది దక్షిణాది మీద చేస్తున్న కామెంట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ హిందీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు అజయ్ దేవగన్ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

    తనదైన నటనతో

    తనదైన నటనతో

    దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన 'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ పరిచయమయ్యాడు. ఈగ సినిమాలో విలన్‌గా నటించిన ఆయన ఆ పాత్రతో ఆకట్టుకున్నారు. ఇక ఆ సినిమా మాత్రమే కాక 'బాహుబలి', 'సైరా: నరసింహారెడ్డి' లాంటి సినిమాల్లో కూడా కీలక పాత్రలలో నటించి తనదైన నటనతో మెప్పించాడు.

    సుదీప్ సంచలన కామెంట్స్‌

    సుదీప్ సంచలన కామెంట్స్‌


    ఇక ప్రస్తుతం సుదీప్‌ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది. అయితే తాజాగా కేజీఎఫ్‌ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీపై సుదీప్ సంచలన కామెంట్స్‌ చేశాడు.

     సంచలన వ్యాఖ్యలు

    సంచలన వ్యాఖ్యలు

    ఒక ప్రెస్‌ మీట్‌లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్‌ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏ మాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళ్ లో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేక పోతున్నాయని అన్నారు. కానీ ఈరోజు దక్షిణాది వారు తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఎందుకు డబ్ చేస్తున్నారు ?

    ఎందుకు డబ్ చేస్తున్నారు ?

    ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఎవరైనా ఈ విషయం మీద స్పందిస్తారా? అనుకుంటూ ఉండగా అజయ్ దేవగన్ సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ హిందీ ఇకపై జాతీయ భాష కాకపోతే, మీ మాతృభాష చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు ? అంటూ సూటిగా ప్రశ్నించారు.

    సుదీప్ రిప్లై

    సుదీప్ రిప్లై


    "సోదరా కిచ్చా సుదీప్... మీ అభిప్రాయం ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ మాతృభాష సినిమాలు హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు? హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృభాష, జాతీయ భాష. జన గణ మన" అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కు సుదీప్ రిప్లై కూడా ఇచ్చారు. హలో అజయ్ దేవ్‌గన్ సార్, నేను ఆ లైన్ ఎందుకు చెప్పానో దానికి సంబంధించిన సందర్భం మీకు తప్పుగా చేరి ఉండవచ్చని పేర్కొన్నారు.

    ఎందుకు అలా చేస్తాను

    ఎందుకు అలా చేస్తాను


    నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఆ ప్రకటన ఎందుకు చేశారో బహుశా అర్ధమయ్యేలా చెప్పవచ్చు. ఇది బాధ పెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఏదైనా చర్చను ప్రారంభించడానికి కాదు. నేను ఎందుకు అలా చేస్తాను సార్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయం ఎంత దూరం వరకు వెళుతుందో చూడాలి.

    English summary
    Kiccha Sudeep clarified to Ajay Devgan about his comments on Hindi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X