వైరల్ పిక్: సైరా నరసింహారెడ్డి.. ఆసక్తి పెంచేలా 'ఈగ' విలన్ ట్వీట్!

Recommended Video

Kiccha Sudeep Reveals Details Of SyeRaa

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు వారికీ కూడా బాగా దగ్గరవుతున్నాడు. రాజమౌళి ఈగ చిత్రంలో సుదీప్ నటన మతి పోగొట్టేవిధంగా ఉంటుంది. ఈ స్టైలిష్ హీరో బాహుబలి చిత్రంలో కూడా చిన్న రోల్ చేశాడు. తాజగా మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. సైరా గురించి ఆసక్తిని పెంచేలా సుదీప్ ఇటీవల ట్వీట్ చేశాడు. ట్వీట్ లో సుదీప్ పోస్ట్ చేసిన ఫోటో కూడా వైరల్ గా మారింది.

క్రేజ్‌కు కారణం

క్రేజ్‌కు కారణం

మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రంపై ఈస్థాయిలో అంచనాలు నెలకొనడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ చిత్రం తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

బిగ్ స్టార్స్ అంతా

బిగ్ స్టార్స్ అంతా

ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి తోపాటు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా వంటి బిగ్ స్టార్స్ నటిస్తున్నాడు. దీనితో సైరా చిత్రంపై జాతీయ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది.

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్

సైరా చిత్ర యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్ట్స్ పనిచేస్తున్నారు. హ్యారీ పోర్టర్, స్కైఫాల్ వంటి సూపర్ హిట్ హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కోరిగ్రఫీ అందించిన గ్రెగ్ పావెల్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నాడు.

సుదీప్ ట్వీట్

గ్రెగ్ పావెల్ తో కలసి పనిచేసే అవకాశం తనకు సైరా చిత్రంతో వచ్చిందని సుదీప్ ట్వీట్ చేసాడు. అతడు అద్భుతమైన కొరియోగ్రాఫర్ అంటూ సుదీప్ ప్రశంసించాడు. సుదీప్ పాత్రకు ఈ చిత్రంలో కీలకమైన ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది.

రెండవ ఇండియన్ మూవీ

రెండవ ఇండియన్ మూవీ

గ్రెగ్ పావెల్ చేస్తున్న రెండవ ఇండియన్ చిత్రం ఇది. గతంలో ఇతడు సల్మాన్ ఖాన్ చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రానికి పనిచేశాడు. సైరా చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతుండడం ఆసక్తిరేపే అంశం. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X