ఫోటోలు : యాక్షన్ 3డిలో ఈగ సుదీప్

By Bojja Kumar

హైదరాబాద్ : ఈగ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటుడు సుదీప్ వచ్చేవారం విడుదల కాబోతున్న అల్లరి నరేష్ మూవీ 'యాక్షన్ 3డి'లో కూడా కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్దమవుతోంది. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈచిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు. సినిమాకు ఎక్కువ మార్కెట్ జరుగాలనే వ్యూహంలో భాగంగానే ఈచిత్రంలో కన్నడ నటుడు సుదీప్‌తో గెస్ట్ రోల్ చేయించినట్లు స్పష్టమవుతోంది. సుదీప్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కావడంతో, పాటు ఈగ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సునీల్, పోసాని కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్, సుదీప్, స్నేహా ఉల్లాల్, నీలం ఉపాధ్యాయ, కమ్నా జఠ్మలానీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్ రెడ్డి, మాస్టర్ భరత్ నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ బప్పి లహరి ఈచిత్రానికి సంగీతం అందించారు.

ఈ చిత్తాన్ని లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవుతూ రూపొందించారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం విడుదలకానుంది. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

కిచ్చా సెదీప్


కిచ్చా సుదీప్, కన్నడలో ప్రముఖ హీరోయి. తెలుగులో నటించిన ఈగ చిత్రంతో ఇక్కడి వారికి కూడా బాగా దగ్గరయ్యాడు.

యాక్షన్ 3డిలో సుదీప్ సీన్...


యాక్షన్ 3డి చిత్రంలో బ్రహ్మానందం, వైభవ్, రాజు సుందరం, అల్లరి నరేష్ లతో కలిసి సుదీప్

ఈ నెల 21న విడుదలవుతున్న యాక్షన్ 3డి


యాక్షన్ 3డి చిత్రంలో ఈ నెల 21న విడుదలకు సిద్ధమైంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తెరకెక్కించారు.

రొమాంటిక్ పాటలతో...


యాక్షన్ 3డి చిత్రం రొమాంటిక్ పాటలు ప్రేక్షకులను అలరించనున్నాయి. రాఘవేంద్రరావు సినిమాల తరహాలో ఈచిత్రంలోని పాటులు చిత్రీకరించారు.

3డి టెక్నాలజీతో రూపొందించిన తొలి కామెడీ మూవీ


3డి టెక్నాలజీతో రూపొందించిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. మరి ప్రేక్షకులను ఈచిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X