'అత్తారింటికి దారేది' కన్నడ వెర్షన్ టీజర్(వీడియో)
హైదరాబాద్: 'మిర్చి' కన్నడ రీమేక్‌తో సక్సెస్ కొట్టిన సుదీప్....మరో తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను కన్నడలో సుదీప్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ ని రానా గా ఫైనలైజ్ చేసి, సుదీప్ పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు.
అత్తారింటికి దారేది చిత్రం రీమేక్ రైట్స్ చంద్రశేఖర్ అనే నిర్మాత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని 'నిమిషాంబ ఫిల్మ్స్' పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగులో ఈచిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. కన్నడ వెర్షన్ కు గానూ నంద కిషోర్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హరిప్రియ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ప్రణిత పోషించిన పాత్రలో కనిపించనుంది. సమంత పాత్రలో కన్నడ హీరోయిన్ రచిత రామ్ నటిస్తుంది.

కన్నడ సీమలో మాత్రం సుదీప్ సూపర్‌స్టార్. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ చేసి అక్కడ విజయాలు అందుకోవడంలో కూడా సుదీప్ దిట్ట. ప్రభాస్ ‘మిర్చి' సినిమా కన్నడంలో సుదీప్ హీరోగా ‘మాణిక్య' పేరుతో రీమేకై అక్కడ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆ విజయం తాలూకు ఆనందంలో తేలియాడుతున్నారు.


Click it and Unblock the Notifications











