»   » రకుల్ ప్రీత్ సింగ్ ఘాటైన ముద్దు, రవితేజకి తక్కువే (వీడియో)

రకుల్ ప్రీత్ సింగ్ ఘాటైన ముద్దు, రవితేజకి తక్కువే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కిక్ 2 సినిమాలో ఓ సీన్లో రకుల్ ప్రీత్ సింగ్ రవితేజతో ముద్దు సీన్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సినిమాలో ఇలాంటి సీన్ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సీన్ గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ...ఆ సీన్ చిత్రీకరించే రోజు వరకు షూటింగ్‌లో రొమాంటిక్ సన్నివేశం ఉంటుందన్నారు. కానీ లిప్ లాక్ సీన్ అని చెప్పలేదు. ఆరోజు సడెన్ గా ఆ సీన్ చేయమని చెప్పగానే నేను వెనుకా ముందు చూసుకున్నాను. మా అమ్మ అక్కడే ఉంది(నవ్వుతూ). అమ్మను అలా బయటకు తీసుకెళ్లమని చెప్పాను ఆ సమయంలో ఆ సీన్ చేసాను అని చెప్పింది రకుల్.

కెరీర్లో తొలిముద్దు హిందీ చిత్రంలో నటించేటప్పుడే చేశాను. అప్పట్లో ముద్దు పెట్టుకునేటప్పుడు నర్వెస్‌గా ఫీలయ్యాను. రవితేజతో చేసేటప్పుడు కంఫర్టుగానే అనిపించింది. ఒకప్పుడు భయం ఉండేది. సినిమాల్లోకి వచ్చాక ఇక్కడ ఇవన్నీ కామన్ అని అర్థమయ్యాక భయం పోయింది అని చెప్పుకొచ్చింది.


Kick 2 Actress Rakul Preet Singh Deep Lip Lock Kissing

స్క్రిప్టు డిమాండ్ చేస్తే ముద్దు సీన్లు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రామ్ చరణ్ అయినా, ఎన్టీఆర్ అయినా, ఇంకెవరైనా..... సినిమా కథ ప్రకారం, స్క్రిప్టు డిమాండ్ మేరకు ముందుకు సాగుతాను అని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. అమ్మడు ఇంత ఫాస్టుగా ఉండబట్టే అనతి కాలంలోనే స్టార్ హీరోలతో చేసే స్థాయికి ఎదిగింది.


అయినా గతంలో రకుల్ ప్రీత్ ‘యారియాన్' సినిమాలో చేసిన ఘాటైన ముద్దు సీన్ తో పోలిస్తే ‘కిక్ 2'లో రవితేజకి ఇచ్చింది అసలు ముద్దు సీనే కాదని చెప్పొచ్చు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ ముద్దు సీన్ ఏ రేంజిలో ఉందో మీరే ఓ లుక్కేయండి.


English summary
Kick 2 Actress Rakul Preet Singh Deep Lip Lock Kissing you never seen.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu