‘కిక్ 2’ సీక్వెల్ కాదు అని తేల్చి చెప్పిన సురేందర్ రెడ్డి
హైదరాబాద్: దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన 'రేసు గుర్రం' చిత్రం ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా...సురేందర్ రెడ్డి తన తర్వాతి ప్రాజెక్టును కూడా ప్రకటించాడు. గతంలో రవితేజ హీరోగా 'కిక్' చిత్రం తెరకెక్కించి భారీ హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి, ఇపుడు 'కిక్-2' చిత్రం చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఈ సినిమా ప్రాజెక్టు గురించి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ....'రవితేజతో 'కిక్ 2' చిత్రం ప్లాన్ చేస్తున్నాను. అయితే ఇది 'కిక్' చిత్రానికి సీక్వెల్ కాదు. కిక్ చిత్రంలోని సెంట్రల్ క్యారెక్టర్లను తీసుకుని డిఫరెంట్ షేడ్స్ లో చూపిస్తాం అన్నారు. ప్రస్తుతం రవితేజ 'పవర్' షూటింగులో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తి కాగానే 'కిక్-2' చిత్రం మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నట్లు సురేందర్ రెడ్డి వెల్లడించారు.
కిక్ 2 చిత్రంలో రవితేజతో పాటు కొన్ని పాత్రలు మాత్రమే కంటిన్యూ అవుతాడు, మిగతా పాత్రలు, పాత్రధారుల విషయంలో మార్పులు చేర్పులు చేయబోతున్నామని సురేందర్ రెడ్డి తెలిపారు. 'కిక్' మూవీ అప్పట్లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో....అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కిక్-2 చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications











