Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రవితేజ-ఇలియానా కొడుకు కథే ‘కిక్-2’ (ఫోటోస్)
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'కిక్' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్లీ కిక్ టీమ్ తో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'కిక్-2' ఆగస్టు 20న ఉదయం 8.43 గంటలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.
నటరత్న ఎన్.టి.రామారావు చిత్ర పటంపై తీసిన ఫస్ట్ షాట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా, మాస్ మహారాజా రవితేజ కెమెరా స్విచాన్ చేసారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేసారు.
స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫోటోలు...
కిక్ ఇచ్చే సినిమా
ఈ సందర్భంగా మాస్ మహరాజా రవితేజ మాట్లాడుతూ...‘కిక్' తర్వాత మళ్లీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో ఫుల్ లెంగ్త్ ఎంటర్టెనర్ చేస్తున్నాను. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది మంచి కిక్ ఇచ్చే సినిమా అవుతుంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ..
దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ....‘ఈ సినిమా ‘కిక్'కి సీక్వెల్ కాదుగానీ అందరికీ డబుల్ కిక్ ఇచ్చే సినిమా అవుతుంది. ‘కిక్'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్-2' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ..
నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... రవితేజ, సురేందర్ రెడ్డి హిట్ కాంబినేషన్. ఈ రోజు నుండే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలిపారు.
సమ్మర్ రిలీజ్
మార్చి 28, 2015 న సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని కళ్యాణ్ రామ్ తెలిపారు.
తెర వెనక...
ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సంగీతం: యస్ యస్ థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్ : నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో
ఇంకా ఈ ప్రారంభోత్సవంలో నందమూరి రామకృష్ణ, ఠాగూర్ మధు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, భోగవల్లి ప్రసాద్, భోగవల్లి బాపినీడు, మహేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.