రవితేజ బర్త్ డే స్పెషల్‌గా రవితేజ ‘కిక్-2’ ఫస్ట్ లుక్
హైదరాబాద్: రవితేజ త్వరలో ‘కిక్-2' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ జనవరి 26న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు రిపబ్లిక్ డే. మరో స్పెషల్ ఏమిటంటే రవితేజ పుట్టినరోజు కూడా అదే రోజు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు.
ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











