రవితేజ,ఇలియానా కాంబినేషన్లో వచ్చిన కిక్ సినిమాలో జెంటిల్ మెన్,ధూమ్ చిత్రాల ఛాయలున్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. వీటిపై దర్శకుడు సురేంద్రరెడ్డి మండిపడ్డారు. దొంగతనం ఎలిమెంట్ ఉన్నంత మాత్రాన కిక్ చిత్రాన్ని వాటితో మీరెలా కంపేర్ చేస్తారు. గతంలోనూ చాలా సినిమాలు పోలీస్,దొంగ చుట్టూ తిరిగే కథతో వచ్చాయి. ఈ సినిమా ధూమ్,జెంటిల్ మెన్ లకు పోలిక ఎంతమాత్రమూ లేదు అన్నారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచన ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే రివెంజ్ చిత్రాలు తీసే తనకు కామెడీ చిత్రాలంటే ఇష్టమని అందుకే ఈ చిత్రాన్ని ఎంటర్టైన్మెంట్ గా తీర్చిదిద్దానన్నారు. అలాగే తొంబై రోజుల్లో చిత్రం ఫినిష్ చేసామని బడ్జెట్ రవితేజ మార్కెట్ స్ధాయిలోనే ఉందన్నాడు. నెక్ట్స్ ఓ యువ హీరోతో లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నానని తెలియపరిచాడు.