అది తమిళ కిక్
రవితేజ, ఇలియానా కాంబినేషన్లో వచ్చిన కిక్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ఎడిటర్ మోహన్ తీసుకున్నారు. ఆయన కుమారుడు రాజా దీనిని డైరక్ట్ చేస్తున్నారు. జయం రవి హీరోగా చేస్తున్నారు. రాజా గతంలో తెలుగులో హనుమాన్ జంక్షన్ రూపొందించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఇలియానా చేసే అవకాశం ఉంది. త్వరలో మిగతా వివరాలు ప్రకటిస్తారు. ఎడిటర్ మోహన్ గతంలో ఎన్నో హిట్ సినిమాలను రీమేక్ చేసి సూపర్ హిట్ చేసారు. తమిళంలోనూ ఈ చిత్రానికి కిక్ అనే టైటిల్ పెడతారని తెలుస్తోంది.
kick tamil versiom editor mohan ravi teja ileana raja jayam ravi రవితేజ ఇలియానా కిక్ తమిళ రీమేక్ రైట్స్ ఎడిటర్ మోహన్ రాజా జయం రవి


Click it and Unblock the Notifications