సురేంద్రరెడ్డి సెంటిమెంట్ అదే?
దర్శకుడు సురేంధ్రరెడ్డి ఇప్పుడో కొత్త సెంటిమెంట్ ని వర్కవుట్ చేస్తున్నాడు. తన కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచి సూపర్ హిట్టయిన అతనొక్కడే చిత్రం రిలీజ్ రోజునే(మే తొమ్మిది) కిక్ చిత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రిప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇలియానా, రవితేజ..ఖతర్నాక్ చిత్రం అనంతరం జత కట్టిన ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని సమచారం. అలాగే ఎస్.తమన్(మళ్ళీ మళ్ళీ, బీబత్సం)చిత్రాలకు సంగీతం సమకూర్చిన ఆడియో మార్కెట్లో ఉంది. ఇక అతిధి పరాజయం అనంతరం వస్తున్న చిత్రం కావటంతో సురేంద్రరెడ్డి భవితవ్యం కూడా తేలనుంది. వక్కంతం వంశి కథ సమకూరుస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో శ్యామ్ పోలీస్ ఆఫీసర్ గా మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











